Bhadrachalam: భద్రాచలం డిపో నుండి ఆంధ్రప్రదేశ్‌కు పెరిగిన బస్సు సర్వీసులు!
Bhadrachalam: భద్రాచలం డిపో నుంచి ఏపీలోని విజయవాడ, గుంటూరు, అమలాపురం, భీమవరం తదితర ప్రాంతాలకు పెంచిన బస్సు సర్వీసులు. వివరాలు వెల్లడించిన డిపో మేనేజర్ జంగయ్య.
Bhadrachalam: భద్రాచలం డిపో నుండి ఆంధ్రప్రదేశ్‌కు పెరిగిన బస్సు సర్వీసులు!
Bhadrachalam: భద్రాచలం డిపో నుండి ఆంధ్ర రాష్ట్రానికి పెంచిన బస్సు సర్వీస్ లు వాటి వివరాలు
విజయవాడ సెక్టార్ నందు సూపర్ లగ్జరీ బస్సు లు 3.00, 4.20, 5.30, 13.40, 14.10, 15.00 గంటలకు బయలుదేరు తాయని, తిరుగు ప్రయాణం లో 7.45, 8.45, 10.00, 19.00, 19.30, 20.00 గంటలకు బయలుదేరుతాయని, గుంటూరు సెక్టార్ నందు ఢిలక్స్ బస్సు లు 8.20, మరియు 20.00 గంటలకు బయలుదేరు తాయని, తిరుగుప్రయాణంలో 8.10, 16.30 గంటలకు బయలుదేరు తాయని, అమలాపురం వయ కుక్కునూరు, రాజమండ్రి మీదుగా డీలక్స్ బస్సు లు 4.30, 10.30 గంటలకు
మరియు express బస్సు 21.00 బయలు దేరు తాయని, తిరుగుప్రయాణంలో express 8.15 గంటలకు మరియు డీలక్స్ బస్సు లు 16.30, 21.00 గంటలకు బయలుదేరు తాయని, భీమవరం వయ పాల్వంచ, దమ్మపేట, చింతలపూడి, ఏలూరు ద్వారా డీలక్స్ బస్సు ఉదయం 6.30 గంటలకు బయలుదేరుతుందని, తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 1.45 గంటలకు బయలుదేరి ఏలూరు వయ కొత్తగూడెం, సత్తుపల్లి,
చింతలపూడి మీదుగా భద్రాచలం చేరుతుందని, అలాగే డీలక్స్ బస్సు మధ్యాహ్నం 2:00 గంటలకు భద్రాచలం నుండి బయలుదేరి వయా కొత్తగూడెం సత్తుపల్లి చింతలపూడి ఏలూరుకు వెళుతుందని, మరుసటి రోజు తిరుగు ప్రయాణంలో ఏలూరులో ఉదయం 8.00 గంటలకు భద్రాచలం కు బయలుదేరుతోందని ఆయన అన్నారు.
అన్ని సర్వీస్ లకు రిజర్వేషన్ సౌకర్యం కలదు. కావున భద్రాచలం చుట్టు ప్రక్కల ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భద్రాచలం డిపో మేనేజర్ పి జంగయ్య కోరారు.




