Khammam: ఖమ్మంలో ఘనంగా ముగిసిన ట్రాన్స్‌కో, డిస్కంల ఇంటర్ సర్కిల్ టోర్నీ!
Khammam: ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో బుధవారం ముగిసిన తెలంగాణ ట్రాన్స్‌కో, డిస్కంల ఇంటర్ సర్కిల్ టెన్నిస్ టోర్నీలో మెట్రో జోన్ విజేతగా నిలిచింది.
Khammam: ఖమ్మంలో ఘనంగా ముగిసిన ట్రాన్స్‌కో, డిస్కంల ఇంటర్ సర్కిల్ టోర్నీ!
ఖమ్మం: ఖమ్మం నగరంలోని స్థానిక సర్దార్ వల్లభభాయ్ పటేల్ స్టేడియంలో తెలంగాణ ట్రాన్స్‌కో, తెలంగాణ డిస్కంల ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్ సర్కిల్ టెన్నిస్ టోర్నమెంట్ చివరి రోజు పోటీలు ఉత్కంఠ భరితంగా ముగిశాయి ఈ పోటీల్లో విజేతలుగా మొదటి స్థానంలో మెట్రో జోన్ రెండో స్థానంలో మహబూబ్‌నగర్ తృతీయ స్థానం లో కార్పొరేట్ ఆఫీస్ హైదరాబాద్ ఆపరేషన్ విజేతగా నిలిచాయి.
ఈ టోర్నమెంట్‌కు బహుమతి ప్రధానోత్సవానికి గౌరవ అధ్యక్షులుగా వివి కృష్ణారావు పాల్గొన్నారు ఖమ్మం అదేవిధంగా బాబు నాయక్, స్పోర్ట్స్ జనరల్ సెక్రటరీ మరియు ADE ఖమ్మం ట్రాన్స్‌కో, పి దాసు ఈ ఈస్ట్రక్షన్ ఖమ్మం ట్రాన్స్‌కో, ఎన్ నాగరత్నం డి ఈ టెలికం ఖమ్మం ట్రాన్స్‌కో, పివి అప్పారావు ఇండోర్ సెక్రటరీ, డి సాంబశివరావు కల్చరల్ సెక్రెటరీ వై అశోక్ కుమార్ ట్రెజరీ, ఎం.వి కృష్ణారావు అవుట్ డోర్ సెక్రెటరీ, జి మధు ఏ ఈ టోర్నమెంట్ ఇంచార్జ్, బి కృష్ణారెడ్డి ఎగ్జిక్యూటివ్ నెంబర్, కె సురేందర్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ నెంబర్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని, క్రమశిక్షణను పెంపొందిస్తాయని తెలిపారు. వయసుతో సంబంధం లేకుండా 50 సంవత్సరాలు పైబడిన ఉద్యోగులు సైతం క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనడం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. వివిధ సర్కిళ్లకు చెందిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా ప్రతిభను చాటుకున్నారు.




