Nelakondapalli: పాల ఆటోను ఢీకొట్టి పల్టీలు కొట్టిన టయోటా గ్లాంజా కారు!
Nelakondapalli: ఖమ్మం-కోదాడ జాతీయ రహదారిపై నేలకొండపల్లి శివారులో అతివేగంగా వచ్చిన టయోటా గ్లాంజా కారు పాల సేకరణ ఆటోను ఢీకొట్టి పల్టీలు కొట్టింది.
Nelakondapalli: పాల ఆటోను ఢీకొట్టి పల్టీలు కొట్టిన టయోటా గ్లాంజా కారు!
Nelakondapalli: ఖమ్మం-కోదాడ జాతీయ రహదారిపై అర్ధరాత్రి వేళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు ముందు వెళ్తున్న పాల సేకరణ ఆటోను బలంగా ఢీకొట్టి రోడ్డుపై పల్టీలు కొట్టింది. నేలకొండపల్లి పట్టణ శివారులోని ప్రియా మిక్సర్ దాటిన తర్వాత పామాయిల్ తోట సమీపంలో గురువారం రాత్రి 11:35 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.
స్థానికులు, తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ వైపు నుంచి ఖమ్మం దిశగా పాల సేకరణ ఆటో వెళ్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన టయోటా గ్లాంజా కారు అదుపుతప్పి ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి కారు రోడ్డుపై రెండు మూడు పల్టీలు కొడుతూ బోల్తా పడింది. రెండు వాహనాలు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి.
ఖమ్మం నగరంలోని ప్రకాశ్‌నగర్‌కు చెందిన ఇద్దరు మహిళలు, (27, 24 సం " లు) ఓ పురుషుడు ( 32 )విజయవాడలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై కారులో తిరిగి ఖమ్మం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళ తల వెనుక భాగంలో తీవ్ర గాయాలవగా, మరో మహిళకు పక్కటెముకలకు బలమైన గాయాలయ్యాయి.
ఆటో డ్రైవర్( 31) చేయి విరగడంతో పాటు అందులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి (28) స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన జాతీయ రహదారి పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను రహదారి అంబులెన్స్‌తో పాటుగా 108లోచికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి వేళ జరిగిన ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై కాసేపు కలకలం రేగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.




