Khammam: అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల వెరిఫికేషన్‌కు పటిష్ట ఏర్పాట్లు: సీపీ!
Khammam: ఖమ్మం పోలీస్ శిక్షణ కేంద్రంలో నవంబర్ 25 నుంచి మే 15 వరకు జరిగే అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల వెరిఫికేషన్‌కు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు.
Khammam: అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల వెరిఫికేషన్‌కు పటిష్ట ఏర్పాట్లు: సీపీ!
Khammam: నవంబరు 25 నుంచి మే 15 వరకు ఖమ్మం పోలీస్ హెడ్ క్వాటర్స్ లోని పోలీస్ శిక్షణ కేంద్రంలో నిర్వహించే అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా సీఐడీ చీఫ్ చారుసిన్హా ఆదేశాల మేరకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.
పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ..బాండ్ పత్రాల పరిశీలన కోసం వచ్చే బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెరిఫికేషన్ ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. రద్దీ నియంత్రణ, క్రమబద్ధమైన నిర్వహణ, భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
డిపాజిటర్లు, బాధితులు, ఏజెంట్లు కేటాయించిన షెడ్యూలు ప్రకారం కేంద్రానికి హాజరై ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేసుకోవాలన్నారు.
ప్రతి రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. మండలాల వారీగా ప్రతి రోజు 250 మంది ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తారని, బాధితుల సౌకర్యార్థం మండలాల వారీగా ధ్రువీకరణ తేదీలను ఇప్పటికే అధికారులు కేటాయించారని పేర్కొన్నారు.
సమావేశంలో సిసియస్ ఏసీపీ సర్వర్, ఎస్బీ ఏసీపీ మహేష్, ఏఆర్ ఏసీపీ సుశీల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.




