Kothagudem: డ్రంక్ అండ్ డ్రైవ్: ముగ్గురికి 2 రోజుల జైలు

Kothagudem: కొత్తగూడెంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ముగ్గురికి స్థానిక రెండో జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు రెండు రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 27 Oct 2026 6:08 PM IST
Kothagudem
X

Kothagudem: డ్రంక్ అండ్ డ్రైవ్: ముగ్గురికి 2 రోజుల జైలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ముగ్గురికి న్యాయస్థానం రెండు రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది.

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో టేకులపల్లి మండలం వెంకట్య తండాకు చెందిన జార్పుల రమేష్, సులానగర్‌కు చెందిన గుగులోతు రమేష్, రాంపూర్‌కు చెందిన గుగులోతు సాయికుమార్ పోలీసులకు పట్టుబడ్డారు. వీరిపై ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. కేసులను విచారించిన కొత్తగూడెం రెండో జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ముగ్గురికి రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్‌హెచ్‌ఓ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉందని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల భద్రత కోసం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM