Bhadrachalam: భద్రాచలంలో దీక్షా దివస్‌కు వేల సంఖ్యలో తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు!

Bhadrachalam: భద్రాచలంలో ఆదివారం నిర్వహించిన దీక్షా దివస్ సభకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రావులపల్లి రాంప్రసాద్ పిలుపునిచ్చారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 29 Nov 2026 6:35 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: భద్రాచలంలో దీక్షా దివస్‌కు వేల సంఖ్యలో తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు!

భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కెసిఆర్ దీక్షా దివస్ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు భద్రాచలం నియోజకవర్గం కార్యకర్తల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంచార్జి రావులపల్లి రాంప్రసాద్, పార్టీ నాయకులు మానె రామకృష్ణ తదితరులు పార్టీ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన ఉద్యమకారులకు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష ఆయన చేసిన పోరాటం, ఉద్యమంలో కీలక ఘట్టాలను నాయకులు,కార్యకర్తలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో దీక్షా దివాస్ కు ప్రత్యేక చారిత్రక ప్రాథన్యత ఉందని ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బిఆర్ఎస్ నాయకులు తెలిపారు. పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఐక్యంగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని భద్రాచలం నియోజకవర్గం ఇంచార్జ్ రావులపల్లి రాంప్రసాద్ పిలుపునిచ్చారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem