Annapureddypalli: 33 కేవీ విద్యుత్ లైన్ పనుల వద్ద తీవ్ర ఉద్రిక్తత!
Annapureddypalli: అన్నపురెడ్డిపల్లిలో 33 కేవీ విద్యుత్ కేబుల్ లైన్ పనుల వద్ద ఉద్రిక్తత. గొడ్డలితో కేబుల్ ధ్వంసం, పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నంతో కలకలం.
Annapureddypalli: 33 కేవీ విద్యుత్ లైన్ పనుల వద్ద తీవ్ర ఉద్రిక్తత!
Annapureddypalli: అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో 33 కేవీ విద్యుత్ లైన్ ఏర్పాటు పనులు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. అధికారులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా, ఓ వ్యక్తి ఏకంగా గొడ్డలితో విద్యుత్ కేబుల్‌ను నరికివేయడం, మరొకరు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి యత్నించడం మండలంలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విద్యుత్ పనులకు ఆటంకం చేసిన కొంత మందిపై కేసులు నమోదు చేశారు.
మండల కేంద్రంలోని ఒడ్డుబజార్లో విద్యుత్ శాఖ సిబ్బంది తమ అధికారిక విధుల్లో భాగంగా 33 కేవీ విద్యుత్ లైన్ ఏర్పాటు పనులు చేపట్టారు. ఇందులో భాగంగా సిబ్బంది వైర్లు లాగుతుండగా కొందరు స్థానికులు కొంత మంది అక్కడికి చేరుకుని పనులను తీవ్రంగా వ్యతిరేకించారు. వీధిలో 33 లైన్ వేయడానికి వీల్లేదంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో విద్యుత్ సిబ్బందికి, స్థానికులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
క్షణాల వ్యవధిలో తారాస్థాయికి వివాదం..
ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం క్రమంగా ఉద్రిక్తతకు దారితీసింది. ఆగ్రహంతో ఊగిపోయిన ఓ వ్యక్తి హఠాత్తుగా గొడ్డలిని తెచ్చి విద్యుత్ కేబుల్ వైర్‌ను నరికివేశాడు. ఇదే సమయంలో మరో వ్యక్తి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుంటూ పనులు కొనసాగిస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ పోలీసుల,విద్యుత్ శాఖ సమక్షంలోనే బెదిరింపులకు దిగాడు. ఈ అనూహ్య పరిణామాలు చూసి విద్యుత్, పోలీసు సిబ్బందితో పాటు అక్కడున్న స్థానికులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు.
పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోవడంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆందోళనకారులను అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా.. గ్రామస్తులు కొందరు పోలీసులను చుట్టుముట్టి అడ్డుకున్నారు. విధుల్లో ఉన్న తమతో వాగ్వాదానికి దిగి దురుసుగా ప్రవర్తించరని విద్యుత్ శాఖ ఏడి రవికుమార్ స్థానిక పోలీసు పిర్యాదు చేశారు.
ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు, బహిరంగ ప్రదేశంలో భయభ్రాంతులకు గురిచేస్తూ విద్యుత్ శాఖ ఆస్తి లక్షరూపాయల కేబుల్ ధ్వంసానికి పాల్పడిన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ సిబ్బంది పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఆందోళనకు పాల్పడిన కొంత మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు స్థానిక సబ్-ఇన్స్పెక్టర్ విజయ్ సింహరెడ్డి మీడియా వెల్లడించారు. ఈ ఘటన మండలంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఏడిఈ ఎం.రవికుమార్ వివరణ ప్రస్తుతం ఉన్న అన్నపురెడ్డిపల్లి సబ్ స్టేషన్ కు ఒకవైపు నుండి మాత్రమే 33 కెవి లైన్ ఉన్నది ప్రత్యామ్నాయంగా కమలాపురం నుంచి కొత్త 33 కెవి లైన్ ఏర్పాట్లు కేబులు వైరు ద్వారా వేస్తున్నాము దీనివల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని,టీవీలు,ఫ్రిజ్ లకు,ఇంటికి ప్రసారమయ్యే విద్యుత్ కు ఎటువంటి ఇబ్బంది ఉండదని మండల ప్రజానీకానికి అందరికీ ఎమర్జెన్సీలో ఈ విద్యుత్తు లైను అత్యంత ఉపయోగకరమైనది అని తెలియజేసారు.




