Bhadrachalam: భద్రాచలంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పర్యటన!
Bhadrachalam: భద్రాచలంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పర్యటన. శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకున్న అనంతరం గిరిజన భూ సమస్యలపై సమీక్ష.
Bhadrachalam: భద్రాచలంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పర్యటన!
Bhadrachalam: భద్రాచలం సెప్టెంబర్ 21 -ఏజెన్సీ ఏరియాలోని గిరిజన రైతులు మరియు రెవెన్యూ కు సంబంధించిన భూ సమస్యలకు పరిష్కరించడానికి తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రావడం జరిగిందని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు.
భద్రాచలం డివిజన్ పర్యటనకు వచ్చిన ఆయనను బిపిఎల్ గెస్ట్ హౌస్ లో సాంఘిక సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఘనంగా స్వాగతం పలికి పుష్పగుచ్చం అందించారు.ఈరోజు ఆయన ఉదయం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దర్శనం చేసుకున్న అనంతరం పలు కార్యక్రమాలలో పాల్గొంటారని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పరిపాలన అధికారి రాంబాబు, పిఎంఆర్సి ప్రిన్సిపాల్ డాక్టర్ వీరు నాయక్, డీఎస్సీడీవో శ్రీలత, ఏ ఎస్ డబ్ల్యూ ఓ హనుమంతరావు, డిడి ట్రైబల్ వెల్ఫేర్ సిబ్బంది రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.




