Bhadrachalam: డిసెంబర్ 13న భద్రాచలంలో టీజేఎస్‌ఏ తొలి రాష్ట్ర సమావేశం!

Bhadrachalam: తెలంగాణ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ (TJSA) తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశం డిసెంబర్ 13న భద్రాచలంలో జరగనుందని ఆహ్వాన కమిటీ తెలిపింది.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 20 Nov 2026 6:21 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: డిసెంబర్ 13న భద్రాచలంలో టీజేఎస్‌ఏ తొలి రాష్ట్ర సమావేశం!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలంలో ఏర్పాటు, తెలంగాణ జర్నలిస్టుల ఐక్యత, క్రీడా స్ఫూర్తి, ఆరోగ్యం, సంక్షేమం లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ (TJSA) రిజిస్ట్రేషన్ నెం..533/2026 తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశం డిసెంబర్ 13వ తేదీ ఆదివారం భద్రాచలంలో నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ఆహ్వాన కమిటీ వెల్లడించింది.

రాష్ట్రవ్యాప్తంగా అసోసియేషన్‌ను బలోపేతం చేయడం,రాష్ట్ర స్థాయి కార్యవర్గ కమిటీ జిల్లాల స్థాయిలో కమిటీల ఏర్పాటు, జర్నలిస్టుల కోసం క్రీడా పోటీలు, ఆరోగ్య కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

అలాగే అసోసియేషన్‌లో వివిధ పదవులు చేపట్టి నూతన బాధ్యతలు స్వీకరించనున్న జర్నలిస్టులను ఘనంగా సత్కరించనున్నారు. జర్నలిస్టుల మధ్య ఐక్యతను పెంపొందించడంతో పాటు క్రీడల ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం, భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా వివిధ క్రీడా కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించడం సమావేశం ప్రధాన ఉద్దేశమని కమిటీ తెలిపింది.

ఈ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టు మిత్రులు, అసోసియేషన్ సభ్యులు, నూతన బాధ్యతలు స్వీకరించనున్న ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆహ్వాన కమిటీ సభ్యులు నాగరాజు,రాజు,అన్వేష్ రెడ్డి తెలిపారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.