Chintoor: వి.ఆర్.పురంలో వృద్ధురాలితో కూటమి అభ్యర్థి ఫోటో వైరల్!
Chintoor: వి.ఆర్.పురంలో కూటమి అభ్యర్థి వాళ్ల విష్ణు ప్రియ రోట్లో కారం కొడుతూ వృద్ధురాలిని పలకరించారు. ఈ వినూత్న ప్రచారం ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది.
Chintoor: వి.ఆర్.పురంలో వృద్ధురాలితో కూటమి అభ్యర్థి ఫోటో వైరల్!
Chintoor: ఎన్నికల ప్రచారం అంటేనే మైకులు, జెండాలు కాదు... ప్రజలతో మమేకమవ్వడమని నిరూపిస్తున్నారు వి.ఆర్.పురం తెలుగుదేశం కూటమి జడ్పీటీసీ అభ్యర్థి వాళ్ల విష్ణు ప్రియ.శుక్రవారం ప్రచారంలో భాగంగా ఓ గ్రామంలో పర్యటించిన విష్ణు ప్రియ, ఒక వృద్ధురాలి ఇంటి వద్ద ఆగారు. ఆ వృద్ధురాలు రోట్లో కారం దంచుతుండటం చూసి, తానూ పక్కన కూర్చుని రోకలి పట్టుకుని కారం కొట్టారు.
ఆమెతో ఆప్యాయంగా మాట్లాడుతూ యోగక్షేమాలు తెలుసుకున్నారు.ఈ ఫోటో ఇప్పుడు స్థానికంగా వైరల్ అవుతోంది. బీజేపీ జనసేన కండువా వేసుకుని ప్రచారం చేస్తున్న విష్ణు ప్రియ సామాన్యులతో కలిసిపోతున్న తీరుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది."గెలిచాక కూడా ఇలాగే ప్రజల్లో ఉంటాను, వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తాను" అని విష్ణు ప్రియ ఈ సందర్భంగా తెలిపారు.




