Chintoor: వి.ఆర్.పురంలో 7 స్థానాలే లక్ష్యంగా టీడీపీ ప్రచారం!

Chintoor: పోలవరం జిల్లా వి.ఆర్.పురంలో స్థానిక ఎన్నికల్లో టీడీపీ దూసుకెళ్తోంది. 7 స్థానాలే లక్ష్యంగా బొర్రా నరేష్ నేతృత్వంలో జోరుగా ప్రచారం చేస్తున్నారు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 30 Oct 2026 10:50 AM IST
Chintoor
X

Chintoor: వి.ఆర్.పురంలో 7 స్థానాలే లక్ష్యంగా టీడీపీ ప్రచారం!

Chintoor: వి.ఆర్.పురం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ దూసుకుపోతోంది.మండలంలోని 7 ఎంపీటీసీ స్థానాలు, ఒక జడ్పీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థులు ప్రచారంలో ముందంజలో ఉన్నారు.టీడీపీ మండల అధ్యక్షుడు బొర్రా నరేష్ ఆధ్వర్యంలో ఈ ప్రచారం జోరుగా సాగుతోంది.

జడ్పీటీసీ అభ్యర్థి వాళ్ల విష్ణుప్రియ ఇంటింటా తిరుగుతూ ఓటర్లను కలుస్తూ ప్రచారంలో ముందున్నారు.ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ మండలంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నారు.

గ్రామాల్లో తీవ్రంగా ఉన్న మంచినీటి సమస్యను పరిష్కరిస్తామని,డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామని,పారిశుధ్యం మెరుగుకు కృషి చేస్తామని,అంతర్గత రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇస్తున్నారు.కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.మండలంలో టీడీపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని, 7 ఎంపీటీసీలు, జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుంటామని బొర్రా నరేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR