Manuguru: సింగరేణి కార్మిక గర్జనకు మణుగూరు నుంచి భారీగా తరలిన కార్మికులు!
Manuguru: మణుగూరు నుంచి గోదావరిఖని సింగరేణి కార్మిక గర్జన సభకు బయలుదేరిన టీబీజీకేఎస్ నాయకులు, కార్మికులు. ఆర్టీసీ బస్సును ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు.
Manuguru: సింగరేణి కార్మిక గర్జనకు మణుగూరు నుంచి భారీగా తరలిన కార్మికులు!
Manuguru: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బి ఆర్ యస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు జెండా ఊపి బస్సును ప్రారంభం. బి.ఆర్.ఎస్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి పిలుపు మేరకు, బి.ఆర్.ఎస్. పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు ఆదేశాల మేరకు, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ గార్ల మార్గదర్శకత్వంలో గోదావరిఖనిలో నిర్వహించే సింగరేణి కార్మిక గర్జన భారీ బహిరంగ సభకు మణుగూరు ఏరియా నుంచి టి.బి.జి.కె.ఎస్ నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున బయలుదేరారు.
మణుగూరు ఏరియా టి.బి.జి.కె.ఎస్ వైస్ ప్రెసిడెంట్ నాగెల్లి నాయకత్వంలో కార్మికులు, సంఘం నాయకులు సభకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు జెండా ఊపి బస్సును ప్రారంభించారు.
సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ సభను విజయవంతం చేసేందుకు మణుగూరు ఏరియా నుంచి నాయకులు, కార్మికులు ఉత్సాహంగా తరలివెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కార్మికుల ఐక్యతను చాటుతూ, సింగరేణి సంస్థ పరిరక్షణకు మరియు కార్మికుల న్యాయమైన హక్కుల సాధనకు తమ సంఘటిత పోరాటాన్ని మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతో టి.బి.జి.కె.ఎస్ శ్రేణులు,నాయకులు ఈ బహిరంగ సభలో పాల్గొనేందుకు బయలుదేరారు.




