Kothagudem: బూర్గంపాడులో అక్రమ ఇసుక దందా టాస్క్ఫోర్స్ దాడులు!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో అక్రమ ఇసుక రవాణాపై జిల్లా టాస్క్ఫోర్స్ దాడి చేసి లారీ, జేసీబీలను స్వాధీనం చేసుకుంది. స్థానిక పోలీసుల తీరుపై ప్రజల ఆగ్రహం.
Kothagudem: బూర్గంపాడులో అక్రమ ఇసుక దందా టాస్క్ఫోర్స్ దాడులు!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండల కేంద్రంలో అక్రమ ఇసుక రవాణాపై జిల్లా టాస్క్ఫోర్స్ అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం. అక్రమంగా ఇసుక లోడ్ చేస్తున్న లారీతో పాటు జేసీబీని అధికారులు పట్టుకున్న ఘటన ఇప్పుడు మండలంలో చర్చనీయాంశంగా మారింది.
మండలంలోని బూర్గంపాడు, సారపాక, ఉప్పుశాఖ, బుడ్డగూడెం తదితర ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంతకాలం ఈ వ్యవహారం కొనసాగుతున్నా స్థానిక పోలీసుల చర్యలు ఏమిటన్న ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
జిల్లా టాస్క్ఫోర్స్ వచ్చి పట్టుకునే వరకు స్థానిక పోలీసులకు ఈ అక్రమ రవాణా కనిపించలేదా?. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాల్సిన స్థానిక యంత్రాంగం ఎందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. స్థానిక పోలీసులకు, ఇసుక అక్రమ రవాణాదారులకు మధ్య ఏమైనా సంబంధాలు ఉన్నాయా? పోలీసుల అండదండలతోనే ఈ దందా సాగుతోందన్న అనుమానాలు ఉన్నాయంటూ కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు.




