Burgampahad: ఇరవెండి అమ్మవారి సన్నిధిలో వైభవంగా అన్నప్రసాద వితరణ!
Burgampahad: ఇరవెండిలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి సన్నిధిలో భక్తులకు అన్నప్రసాద వితరణను తాళ్లూరి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంచాక్షరయ్య ప్రారంభించారు.
Burgampahad: ఇరవెండి అమ్మవారి సన్నిధిలో వైభవంగా అన్నప్రసాద వితరణ!
బూర్గంపాడు: మండల పరిధిలోని ఇరవెండిలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం అమ్మవారి సన్నిధిలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తాళ్లూరి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తాళ్లూరి పంచాక్షరయ్య ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తొలుత అమ్మవారిని దర్శించుకున్న తాళ్లూరి పంచాక్షరయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణను ప్రారంభించారు.
శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదం అందించడం పట్ల నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరి చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ వల్లూరిపల్లి వంశీకృష్ణ, బూర్గంపాడు సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.




