Palair; పాలేరులో ఎల్ నినో కరువు నివారణ చర్యలు చేపట్టాలి: న్యూ డెమోక్రసీ!
Palair: పాలేరు పరిధిలో ఎల్ నినో కరువు నివారణ చర్యలు చేపట్టి, రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నేతలు ఆదివారం డిమాండ్ చేశారు.
Palair; పాలేరులో ఎల్ నినో కరువు నివారణ చర్యలు చేపట్టాలి: న్యూ డెమోక్రసీ!
పాలేరు: కూసుమంచి నేలకొండపల్లి ముదిగొండ సాయుక్త మండలాల అధ్వారములో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి. పోటు లక్ష్మయ్య గారు అధ్యక్ష వహించగా ముఖ్యఅతిథిగా సహీయుక్త మండలాల కార్యదర్శి ఐ వెంకన్న మాట్లాడుతూరాష్ట్ర ప్రభుత్వం కరువు నివారణ చర్యలని వెంటనే చేపట్టాలి రైతు ల కు ఇచ్చిన హామీ ప్రకారం మాఫీ గాని రైతులకు రెండు లక్షల రూపాయలను మాఫీ చేయాలి.
వ్యవసాయ అవసరాల కొత్త రుణాలు ఇవ్వాలి ఎనిమిది గంటల కరెంటు సప్లై చేయాలి 14 రకాల నిత్యవసర సరుకులను రేషన్ షాపుల ద్వారా ప్రజలకు అందించాలి విద్య వైద్యం ప్రజలకి ఫ్రీగా అందేటట్లుగా చర్యలు చేపట్టాలి పాలే డివిజన్ కార్యదర్శి బజ్జూర్ వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గరినుండి రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాడని రైతు ను వ్యవసాయానికి దూరం చేస్తున్నాడని అలాగే కార్పొరేట్లకు వ్యవసాయం ఒప్ప చెప్పే కుట్రలు చేస్తున్నారన్నారు.
ఢిల్లీలోగత రైతు ఉద్యమం సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకపోగా దొడ్డి దారిన వాటిని మళ్లీతీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రైతులు అనేక సంవత్సరాలుగా మద్దతు ధర చట్టం చేయాలని కోరుతున్న పట్టించుకోవడం లేదు కానీ వద్దన్నా నూతన విత్తన చట్టాన్ని తీసుకొచ్చి రైతులనుమరింత అప్పుల్లోనికి కూర్కుపోయేటట్లు చేశాడన్నారు.
స్వామినాథన్ సిఫారసులు అమలు చేయాలని కరువు సహాయక పనులు చేపట్టాలని పాత పద్ధతిలోనే ఉపాధి హామీ కొనసాగించాలని. ప్రైవేట్ ని ఆపాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు మాతంగి రామస్వామి చెరుకుపల్లి వీరయ్య న్యూ డెమోక్రసీ మండల్ నాయకులు బుర్ర సైదులు నిమ్మల వెంకన్నపో కల వెంకన్న దాట్ల వీరస్వామి ఎస్ కే రహీం దోమల వెంకన్న. రెడ్డబోయిన. సంజీవరావు.




