Bayyaram: గార్లలో టైలర్ షాపు దగ్ధం -రూ.2 లక్షల ఆస్తి నష్టం!
Bayyaram: మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని రాజా టైలర్ షాపులో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగి రూ.2 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది.
Bayyaram: గార్లలో టైలర్ షాపు దగ్ధం -రూ.2 లక్షల ఆస్తి నష్టం!
Bayyaram: మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని రాజా టైలర్ షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. షాపు యజమాని వాంకుడోత్ బాలు మాట్లాడుతూ ఈ షాపు రాత్రి సుమారు 3 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయిందని స్థానికులు బాలు కు సమాచారం తెలిపారు అన్నాడు, గత 50 సంవత్సరాల నుంచి గార్ల మండల కేంద్రంలో టైలర్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నానని ప్రతిరోజూ లాగానే ఈరోజు కూడా రాత్రి షాపు బంద్ చేసుకుని ఇంటికి వెళ్లిపోయారు. తెల్లవారి ఉదయం వచ్చి చూసేసరికి షాపు పూర్తిగా కాలిపోయి కనిపించింది.
ఈ ప్రమాదంలో షాపులో ఉన్న బట్టలు, కుట్టు మిషన్లు, ఇతర సామాగ్రి మొత్తం బూడిదపాలయ్యాయి. సుమారు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని ఆవేదన చెందాడు,
ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. బాధిత టైలర్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు, సిపిఎం, సిపిఐ నాయకులు కోరారు. టైలర్ బాలు ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.




