Kothagudem: అక్టోబర్ 9న జరిగే ఆర్టీసీ ఎన్నికల్లో ఐక్య కూటమి విజయం తథ్యం

Kothagudem: కొత్తగూడెంలో SWF - TMU ఐక్య కూటమి ప్రెస్ మీట్. ఆర్టీసీ ఎన్నికల్లో కూటమిని గెలిపిస్తే కాంగ్రెస్ మేనిఫెస్టో అమలుకు కృషి చేస్తామని నేతల ప్రకటన.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Updated on: 7 Oct 2026 9:12 PM IST
Kothagudem
X

Kothagudem: అక్టోబర్ 9న జరిగే ఆర్టీసీ ఎన్నికల్లో ఐక్య కూటమి విజయం తథ్యం

Kothagudem: 09-10-2026 శుక్రవారం ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, టీఎంయూ ఐక్య కూటమి ఆధ్వర్యంలో బస్టాండ్ ఆఫీస్ నందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ ప్రెస్ మీట్ లో SWF రీజియన్ సహాయ కార్యదర్శి యాస నాగేశ్వరరావు, CITU జిల్లా కార్యదర్శి భూక్య రమేష్, SWF సీనియర్ నాయకులు మల్సూర్, చారి, ప్రస్తుత డిపో అధ్యక్ష కార్యదర్శులు బత్తుల నాగేశ్వరరావు, ఇసనపల్లి శామ్యూల్ కుమార్, రీజియన్ సహాయ కార్యదర్శి పర్వీన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ...

- ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఐక్య కూటమిని గెలిపిస్తే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేయిస్తామని తెలిపారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం, పెండింగ్ లో ఉన్న పే స్కేల్, ఆర్టీసీలో యూనియన్లకు అనుమతి అంశాలను అమలు చేయిస్తామన్నారు.

- కాంగ్రెస్ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక 2026 ఏప్రిల్ 22,23,24 తేదీల్లో అన్ని యూనియన్లు సంపూర్ణ ఐక్యతతో సమ్మె చేయడంతో ప్రభుత్వం అన్ని యూనియన్లతో చర్చలు జరిపి 2021 సంవత్సర 11% వేతన సవరణ చేసిందన్నారు.

- గుర్తింపు యూనియన్ ఎన్నికల ప్రక్రియ కోసం కృషి చేయడంతో ఎన్నికలు జరుగుతున్నాయని, గెలిచిన గుర్తింపు సంఘ ప్రతినిధులతోనే విలీన కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు.

- టీఎంయూ అశ్వద్ధామ రెడ్డి వర్గంతో TWU వారు జత కట్టి, SWF తో ఐక్య కూటమిగా ఏర్పడ్డారని, ఈ ఐక్య కూటమికి INTUC కూడా మద్దతు ఇస్తోందన్నారు.

- ఖమ్మం, నల్గొండ రీజియన్లలో SWF నక్షత్రం గుర్తుపై, మిగిలిన రీజియన్లలో, రాష్ట్ర గుర్తింపులో TWU బాణం గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

- గతంలో ఖమ్మం రీజియన్ లో SWF గుర్తింపులో ఉండగా కొత్తగూడెంలో డిస్పెన్సరీ ఏర్పాటు, గ్యారేజీలలో ఫెడెస్టల్ ఫ్యాన్ల ఏర్పాటు, సింగిల్ క్రూ లేకుండా చేయడం వంటి ఘనత SWF కు ఉందని తెలిపారు.

ఐక్య కూటమి గెలిస్తే భవిష్యత్తులో ఆర్టీసీ పరిరక్షణ కోసం, కార్మికుల హక్కుల కోసం రాజీలేని పోరాటాలు చేస్తామని, ప్రత్యర్థులు ఎన్ని అవాకులు, చవాకులు పేలినా 9వ తేదీన జరిగే ఎన్నికల్లో కార్మికులు తగిన బుద్ధి చెప్పబోతున్నారని అన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM