Kothagudem: 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి: బీజేపీ ధర్నా
Kothagudem: రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని, విద్యుత్ కోతలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం TGNPDCL ఎస్ఈ ఆఫీస్ ఎదుట బీజేపీ ధర్నా చేపట్టింది.
Kothagudem: 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి: బీజేపీ ధర్నా
Kothagudem: భద్రాది కొత్తగూడెం జిల్లా TGNPDCL సూపర్డెంట్ ఇంజనీరింగ్ కార్యాలయం ఎదుట కార్యాలయం ఎదుట భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులకు 24 గంటలు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించాలి – అప్రకటిత విద్యుత్ కోతలను ఎత్తు వేయాలని ధర్నా నిర్వహించడం జరిగినది అనంతరం సూపర్డెంట్ కార్యాలయంలో DE. జి రంగస్వామి గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరి రమేష్ మాట్లాడుతూ
వ్యవసాయానికి 24 గంటలు నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, అప్రకటిత విద్యుత్ కోతలను తక్షణమే నిలిపివేయాలని, లోవోల్టేజీ సమస్యలను పరిష్కరించాలని విద్యుత్ సరఫరాలో అంతరాయాల వల్ల పంటలకు నష్టం వాటిల్లుతున్న నేపథ్యంలో నష్టపోయిన రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించాలి
రైతులు వ్యవసాయ పనులు సజావుగా చేసుకునేందుకు విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి విద్యుత్ శాఖ మంత్రి ముగ్గురు మంత్రులు ఉండి రైతులకు ప్రత్యామ్నాయ పంటలు మార్గాలు చూపించకుండా రబీ పంటలు పంటల వేయొద్దు క్రాఫ్ హాలిడే ప్రకటించటం, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది సిగ్గుచేటు చర్య, కాంగ్రెస్ మంత్రులను రైతులు ఛీ కొడుతున్నారు, సీతారాం ప్రాజెక్టు ద్వారా నీళ్లు భద్రాద్రి జిల్లాకి అందజేయకుండా వాళ్ల సొంత నియోజకవర్గం నీళ్లు వచ్చే నాగార్జున ఎడమ కాలుకు నీళ్లు తీసుకెళ్తున్నారు.
ఈ ప్రాంత వాసులకు నీరు ఇవ్వకపోవడం ఈ జిల్లా రైతుల ఉసురు కొట్టుకుంటారు. ఈ జిల్లాలో గోదావరి నీలు ఉండి కేటీపీఎస్ విద్యుత్ తయారీ కేంద్రం ఉండి, ఈ జిల్లాలను బొగ్గు గనులు ఉండి ఈ జిల్లా కరెంటు కోతలు విధించడం సిగ్గుచేటు, కేంద్ర ప్రవేశపెట్టిన పసల్ బీమా ని అమలు చేయకుండా ఉండటంవల్ల ఈరోజు రైతు నష్టపోతే నష్టపరిహారం రావడం లేదు.
దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తూ రైతులకు నష్టపర ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏలినా ప్రభావం వల్ల వర్షాలు పడట్లేదని ముందే తెలిసినా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. కావున రైతులందరూ కూడా బ్యాంకు రుణాలు మాఫీ చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వరంగల్ డిక్లేషన్లో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి చిలుకూరి రమేష్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నిరసన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గొట్టిపుల్ల దుర్గా శ్రీనివాసరావు, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మాదినేని సతీష్ చీకటి ప్రకాష్, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి డా జాటోత్ వెంకన్న, బోగి కృష్ణయ్య, బిజెపి సీనియర్ నాయకులు ముసుకు శ్రీనివాస్ రెడ్డి, బెజ్జం శ్రీనివాస్ రెడ్డి, ఉడత నేని విశ్వేశ్వరరావు,యువ మోర్చా అధ్యక్షులు మోహన్ కృష్ణ, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ నాగుల చందు, ప్రధాన కార్యదర్శి కోలా హరీష్, రాష్ట్ర గిరిజన మోర్చా నాయకులు తంబళ్ల, తెల్లం నరసింహారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు బాలాజీ నాయక్, సీనియర్ నాయకులు బాలు నాయక్ మండల అధ్యక్షులు రాపాక రమేష్, నవీన్ కుమార్, శంభు నాయక్, నిమ్మటూరి రామారావు బీరక సాయి శ్రీను,సీనియర్ నాయకులు కేశ గాని శ్రీనివాస్ గౌడ్, పైడిపాటి రవీందర్, పవన్ కుమార్, కుమార్, తదితరులు పాల్గొన్నారు




