Sujathanagar: ఫార్మర్ రిజిస్ట్రేషన్ గడువు పెంచాలి

Sujathanagar: ఫార్మర్ రిజిస్ట్రేషన్ గడువు కేవలం వారం రోజులు ఇవ్వడం సరికాదని, గడువును పెంచాలని సుజాతనగర్‌లో తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 30 Sept 2026 6:03 PM IST
Sujathanagar
X

Sujathanagar: ఫార్మర్ రిజిస్ట్రేషన్ గడువు పెంచాలి

సుజాతనగర్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్ రిజిస్ట్రేషన్ గడువును పెంచాలని తెలంగాణ రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సుజాతనగర్ మండలం కమిటీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కున్సోత్ ధర్మ మాట్లాడుతూ.. రైతులు 11 అంకెల డిజిటల్ ఐడి పొందాలని,ప్రభుత్వం కొత్త విధానంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసిందని, రైతులు మీ సేవలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచిస్తోందన్నారు.

అయితే రిజిస్ట్రేషన్ కోసం సెప్టెంబర్ 22 నుంచి 30 వరకు కేవలం వారం రోజుల గడువు మాత్రమే ఇవ్వడం సరికాదన్నారు. ప్రస్తుతం రైతులు పొలం పనుల్లో బిజీగా ఉన్నారని, మారుమూల ప్రాంతాల్లోని చాలా మంది రైతులకు ఇప్పటికీ రిజిస్ట్రేషన్ గురించి పూర్తి సమాచారం కూడా చేరలేదన్నారు.

మీ సేవా కేంద్రాలకు, వ్యవసాయ శాఖ కార్యాలయాలకు, రైతు వేదికల వద్దకు వెళ్లినా సాంకేతిక కారణాలతో ఆన్ లైన్ కావడం లేదని, దీంతో ఒక్కో రైతు పొలం పనులు పక్కనపెట్టి రెండు మూడు రోజులు తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

పిఎంకిసాన్, పంటల భీమా, ఎరువుల బుకింగ్, మద్దతు ధరలు, బ్యాంకు రుణాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ పథకాలు సబ్సిడీలు తదితర ప్రయోజనాలు పొందాలంటే..ప్రభుత్వం కంపల్సరీ అంటున్న ఫార్మర్ రిజిస్ట్రేషన్ అందరు రైతులు చేయించుకునేలా గడువు పెంచాలని తెలంగాణ రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల కమిటీ తరఫున డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం సుజాతనగర్ మండల కార్యదర్శి బచ్చలకూర శ్రీనివాసరావు, మండల అధ్యక్షుడు నలగోపు పుల్లయ్య, గండమాల భాస్కరరావు కాట్రాల తిరుపతి పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM