Sujathanagar: కూలీలకు రోజుకు రూ.308 వచ్చేలా చూడాలి
Sujathanagar: సుజాతనగర్ మండలం రాఘవాపురంలో ఉపాధి హామీ మేట్స్ శిక్షణ. కూలీలకు రోజుకు రూ.308 వేతనం వచ్చేలా కొలతల ప్రకారం పనులు చేయించాలని అదనపు డీఆర్డీఓ ఆదేశం.
Sujathanagar: కూలీలకు రోజుకు రూ.308 వచ్చేలా చూడాలి
సుజాతనగర్: సుజాతనగర్ మండలం రాఘవాపురం రైతు వేదిక నందు మేట్స్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు డీఆర్డీఓ ఎన్. రవి ప్రసంగిస్తూ - కూలీలకు ప్రతిరోజు రూ.308 వచ్చే విధంగా మార్కింగ్ ఇచ్చి కొలతల ప్రకారం పని చేయించాలని సూచించారు.
ప్రతిరోజు ఉదయం NMMS ద్వారా హాజరు పంపి, పని చేసిన నాలుగు గంటల తర్వాత కూడా తప్పకుండా రెండో ఫోటో పంపించాలని సూచించారు. పనులు నాణ్యతతో చేయించాలని, జాబ్ కార్డు నందు పని చేసిన వివరాలు నమోదు చేయాలని సూచించారు.
శిక్షణ కార్యక్రమంలో ఏపీడీ విజయభాస్కర రెడ్డి, ఎంపీడీవో భారతి, డీటీసీ రాజు, ఏపీవో పోరండ్ల రంగా, ఈసీ నాగరాజు, క్షేత్ర సాంకేతిక సహాయకులు శాంతి ప్రియ, ప్రసాద్, పుష్పలత, కుమార్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు




