Khammam: గంగమ్మ తల్లి దేవాలయ శంకుస్థాపనలో పాల్గొన్న సుడా చైర్మన్!

Khammam: ఖమ్మం 14, 15వ డివిజన్ల గంగమ్మ తల్లి నగర్‌లో నూతన దేవాలయ శంకుస్థాపన కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ ఆదివారం పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 29 Nov 2026 3:58 PM IST
Khammam
X

Khammam: గంగమ్మ తల్లి దేవాలయ శంకుస్థాపనలో పాల్గొన్న సుడా చైర్మన్!

ఖమ్మం: ఖమ్మం నగరంలోని 14, 15వ డివిజన్ల పరిధిలోని కొత్తగూడెం గంగమ్మ తల్లి నగర్‌లో నూతనంగా నిర్మించనున్న శ్రీ గంగమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమానికి ఖమ్మం స్తంభాద్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (SUDA) చైర్మన్ శ్రీ పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ గారు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఆలయ నిర్మాణ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా త్వరగా పూర్తికావాలని ఆకాంక్షించారు. దేవాలయాలు ఆధ్యాత్మికతకు నిలయాలని, ప్రజల మధ్య ఐక్యత, భక్తిభావం మరియు సాంస్కృతిక సంప్రదాయాలను పెంపొందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పుచ్చకాయల వీరభద్రం, పాలకుర్తి నాగేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ చేతుల నాగేశ్వరరావు, డివిజన్ అధ్యక్షులు కమ్మతం రామకృష్ణ, దేవాలయ కమిటీ సభ్యులు, ఇతర నాయకులు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.