Bhadrachalam: పుష్కర్ ఘాట్ పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేయండి!

Bhadrachalam: వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో భద్రాచలంలో నూతనంగా నిర్మిస్తున్న పుష్కర ఘాట్ పనులను సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట పరిశీలించారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 21 Nov 2026 9:56 AM IST
Bhadrachalam
X

Bhadrachalam: పుష్కర్ ఘాట్ పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేయండి!

Bhadrachalam: వచ్చే సంవత్సరం జరిగే గోదావరి పుష్కరాలకు గోదావరి పుష్కర స్నానాలకు భద్రాచలంకు వచ్చే అవకాశం ఉందని అందుకు నూతనంగా నిర్మాణం చేపడుతున్న పుష్కర ఘాట్ పనులు వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లకు ఆదేశించారు.

ఈరోజు నీటిపారుదల శాఖ క్షేత్రస్థాయి ఇంజనీర్లతో కలిసి భద్రాచలంలో జరుగుతున్న పుష్కర ఘాట్ పనులను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సీతారామచంద్ర స్వామి కొలువై ఉన్న భద్రాచలంలో జరిగే గోదావరి పుష్కరాలకు గోదావరిలో పుష్కర స్నానాలు చేయడానికి దేశ విదేశాల నుండి భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున పుష్కర స్నానం చేసే భక్తులకు సౌకర్యవంతంగా మరియు భక్తులకు సరిపడా పుష్కర ఘాట్లు అందుబాటులో ఉండేలా నూతనంగా నిర్మాణం చేపడుతున్న పుష్కర ఘాట్ లు నాణ్యత ప్రమాణాలు పాటించి ఇరిగేషన్ అధికారులు,

ఇంజనీర్లు ప్రత్యేక శ్రద్ధ చూపి పనులను సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మరియు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem