Rudrampur: సైబర్ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ జుబేదా
Rudrampur: డిజిటల్ యుగంలో విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మోసపోతే 1930కి కాల్ చేయాలని రుద్రంపూర్ సదస్సులో ఎస్ఐ జుబేదా సూచించారు.
Rudrampur: సైబర్ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ జుబేదా
రుద్రంపూర్: డిజిటల్ యుగంలో రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కొత్తగూడెం సబ్ ఇన్‌స్పెక్టర్ జుబేదా సూచించారు. రుద్రంపూర్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ నేరాలు, సమాచార భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఐ జుబేదా మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆన్‌లైన్ మోసాలు, సోషల్ మీడియా నేరాలు, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ మోసాలు పెరుగుతున్నాయని తెలిపారు. విద్యార్థులు గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయకూడదని, వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌లు, ఓటీపీలను ఇతరులతో పంచుకోకూడదని సూచించారు. సైబర్ నేరాల బారిన పడితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని వివరించారు.
కళాశాల ప్రిన్సిపాల్ బి. కరుణ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు సైబర్ భద్రతపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఇన్‌చార్జి రవికుమార్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించి, ఆన్‌లైన్ మోసాల నుంచి రక్షణ పొందేలా చేయడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.




