Julurupadu: కేటీఆర్‌పై వ్యక్తిగత విమర్శలు మానాలి: లకావత్ గిరిబాబు
Julurupadu: కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శలను వైరా బీఆర్ఎస్ నేత లకావత్ గిరిబాబు ఖండించారు. ఎన్నికల హామీలపై దృష్టి పెట్టాలన్నారు.
Julurupadu: కేటీఆర్‌పై వ్యక్తిగత విమర్శలు మానాలి: లకావత్ గిరిబాబు
జూలూరుపాడు: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గారి వ్యక్తిగత రూపంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు తీవ్రంగా ఖండించారు.
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ప్రజా సమస్యలపై మాట్లాడాల్సింది పోయి ప్రతిపక్ష నాయకుల వ్యక్తిగత జీవితాలు, రూపురేఖలపై వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు. రాజకీయాల్లో విధానాలు, ప్రజా సమస్యలపై విమర్శలు ఉండాలి తప్ప వ్యక్తిగత దూషణలకు తావుండకూడదని పేర్కొన్నారు.
కేటీఆర్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత విమర్శలకు దిగడం రేవంత్ రెడ్డి రాజకీయ అసహనానికి నిదర్శనమని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని, ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.
రైతు భరోసా, రుణమాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు, మహిళలకు ఇచ్చిన హామీలు సహా ప్రజలకు సంబంధించిన కీలక సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రజలు ముఖ్యమంత్రిని కోరుకునేది వ్యక్తిగత విమర్శలు కాదు.. అభివృద్ధి, సంక్షేమం, ఇచ్చిన హామీల అమలు. ఇప్పటికైనా రాజకీయ విమర్శలను పక్కనపెట్టి రాష్ట్ర ప్రగతిపై దృష్టి సారించాలని లకావత్ గిరిబాబు హితవు పలికారు.




