Sathupally: సత్తుపల్లిలో ఘనంగా రాష్ట్రస్థాయి మహిళల కబడ్డీ పోటీల ఏర్పాట్లు!

Sathupally: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి జన్మదినం సందర్భంగా సత్తుపల్లిలో అక్టోబర్ 28 నుంచి 30 వరకు 73వ రాష్ట్రస్థాయి మహిళల కబడ్డీ పోటీలు జరగనున్నాయి.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 26 Oct 2026 3:34 PM IST
Sathupally
X

Sathupally: సత్తుపల్లిలో ఘనంగా రాష్ట్రస్థాయి మహిళల కబడ్డీ పోటీల ఏర్పాట్లు!

Sathupally: మహిళా క్రీడాకారులను ప్రోత్సహించడం, క్రీడారంగంలో మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పించడం, యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడం లక్ష్యంగా సత్తుపల్లిలో రాష్ట్రస్థాయి మహిళల కబడ్డీ పోటీలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ex.TGIDC చైర్మన్ శ్రీ మువ్వా విజయబాబు గారు వెల్లడించారు.

మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని, మువ్వా విజయబాబు గారి ఆధ్వర్యంలో, మువ్వా యూత్ – సత్తుపల్లి వారి నిర్వహణలో 73వ రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల కబడ్డీ పోటీలు అక్టోబర్ 28, 29, 30 తేదీల్లో మూడు రోజుల పాటు సత్తుపల్లిలోని రాణి సెలబ్రేషన్స్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ పోటీలకు సంబంధించిన వివరాలను తెలియజేయడానికి సోమవారం సత్తుపల్లిలోని రాణి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మువ్వా విజయబాబు గారు మాట్లాడారు. రాష్ట్రస్థాయిలో మహిళా క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు, తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకునేందుకు ఇటువంటి క్రీడా పోటీలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.

కబడ్డీ మన దేశ సంప్రదాయ క్రీడల్లో ఒకటని, గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ఆదరణ పొందిన ఈ క్రీడ మహిళల్లో ఆత్మవిశ్వాసం, పట్టుదల, క్రమశిక్షణ, జట్టుగా పనిచేసే తత్వాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్న ప్రస్తుత తరుణంలో క్రీడారంగంలోనూ వారికి తగిన ప్రోత్సాహం అందించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

మహిళా క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతో పాటు, రాష్ట్రస్థాయిలో తమ సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు ఈ పోటీలు ఒక మంచి వేదికగా నిలుస్తాయని అన్నారు. క్రీడల ద్వారా యువతలో ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రమశిక్షణ, పోటీతత్వం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని తెలిపారు.

మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ రాష్ట్రస్థాయి క్రీడా కార్యక్రమం మహిళా క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందించడంతో పాటు, సత్తుపల్లి ప్రాంతానికి క్రీడా రంగంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చేందుకు దోహదపడుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

అక్టోబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళా కబడ్డీ జట్లు తరలిరానున్న నేపథ్యంలో, క్రీడాభిమానులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై క్రీడాకారులను ప్రోత్సహించాలని మువ్వా విజయబాబు గారు కోరారు. ప్రతి ఒక్కరూ ఈ క్రీడా వేడుకలో భాగస్వాములై పోటీలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కటికాల క్రిస్టఫర్ బాబు( స్టేట్ వైస్ ప్రెసిడెంట్ - ఖమ్మం జిల్లా సెక్రెటరీ) గారు, k.స్వాతిముత్యం ( స్టేట్ జాయింట్ సెక్రెటరీ - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెక్రెటరీ)గారు, ch.సుధాకర్ గారు(ఖమ్మం జిల్లా జాయింట్ సెక్రెటరీ(పత్రికా మిత్రులు, సత్తుపల్లి పట్టణం 1వ వార్డు కౌన్సిలర్ మట్టా ప్రసాద్ గారు, 6వ వార్డు కౌన్సిలర్ సుజల రాణి గారు, బెతుపల్లి సర్పంచ్ దొడ్డా రాజేంద్ర ప్రసాద్ (అమ్ములు) గారు, భీమవరం సర్పంచ్ వంట్ల రమేష్ గారు, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు, పొంగులేటి, మువ్వా గారి అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

క్రీడలకు ప్రోత్సాహం – మహిళా శక్తికి గౌరవం – సత్తుపల్లి ఖ్యాతికి మరో మైలురాయి!

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI