Khammam: రేపు చిన్నజీయర్ స్వామి అమృత హస్తాలతో వేంకటేశ్వరాలయ శంకుస్థాపన!
Khammam: ఖమ్మం జిల్లా కొత్తగూడెం–అల్లీపురం మధ్య శ్రీ వేంకటేశ్వర స్వామి నూతన ఆలయ శంకుస్థాపన త్రిదండి చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా, మంత్రి తుమ్మల ఆధ్వర్యంలో జరగనుంది.
Khammam: రేపు చిన్నజీయర్ స్వామి అమృత హస్తాలతో వేంకటేశ్వరాలయ శంకుస్థాపన!
ఖమ్మం: ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత, మనందరి ఆరాధ్య నాయకులు, గౌరవ రాష్ట వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, నిత్య కృషివలుడు, మనందరి అభిమాన నాయకులు శ్రీ తుమ్మల యుగంధర్ గారి పర్యవేక్షణలో, 12-10-2026,సోమవారం ఉదయం 9:10 ల నుండి10:20 వరకు పూజ జరుగును. కొత్తగూడెం–అల్లీపురం గ్రామాల మధ్య కలియుగ దైవం శ్రీ శ్రీనివాస వేంకటేశ్వర స్వామి వారి నూతన దేవాలయ శంకుస్థాపన మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడనుంది.
ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని పూజ్య గురుదేవులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి అమృత హస్తాలతో ఘనంగా నిర్వహించనుండటం మనందరికీ ఎంతో ఆనందకరమైన, పుణ్యప్రదమైన విషయం. అలాగే టిటిడి సిబ్బంది,అయ్యవార్లు పాల్గోంటారు.
భక్త మహాశయులకు, ప్రజలందరికీ మనవి!
ఈ మహోన్నత ఆధ్యాత్మిక వేడుకకు కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో విచ్చేసి, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని, స్వామివారి దివ్య ఆశీస్సులు పొందవలసిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.




