Khammam: నిరుద్యోగ యువతకు ప్రత్యేక మోటివేషన్ క్లాస్ నిర్వహణ!
Khammam: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చైర్మన్ ఎండీ ఖాదర్ బాబా ఆధ్వర్యంలో సోమవారం మోటివేషన్ క్లాస్ నిర్వహించారు.
Khammam: నిరుద్యోగ యువతకు ప్రత్యేక మోటివేషన్ క్లాస్ నిర్వహణ!
ఖమ్మం: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ *ఎండీ ఖాదర్ బాబా గారి ప్రత్యేక చొరవతో, వారి ఆధ్వర్యంలో* జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వివిధ ప్రభుత్వ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత కోసం ప్రత్యేక మోటివేషన్ క్లాస్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సైకాలజీ లెక్చరర్ మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నిపుణులు తాళ్లూరి సృజన్ కుమార్ గారు పాల్గొని గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, DSC, SI, కానిస్టేబుల్ తదితర ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకు సంబంధించిన సిలబస్, పరీక్షా విధానం, ప్రిపరేషన్, ప్రాక్టీస్, ప్రజెంటేషన్ మరియు సమయ నిర్వహణ వంటి అంశాలపై యువతకు విలువైన సూచనలు, దిశానిర్దేశం చేశారు.
ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కూరపాటి ప్రదీప్ గారు మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు చదువుతో పాటు ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. తగినంత నిద్ర, పౌష్టికాహారం, వ్యాయామం మరియు మానసిక ప్రశాంతత ఎంతో అవసరమని వివరించారు. పరీక్షల ఒత్తిడిని అధిగమించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని తెలిపారు.
ఈ సందర్భంగా *జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ ఖాదర్ బాబా గారు* మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు సరైన మార్గదర్శకత్వం, నిపుణుల సూచనలు అందించాలనే లక్ష్యంతో ఇటువంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. యువతకు అవసరమైన పఠన వాతావరణం, గ్రంథాలయ సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుంటూ పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో ప్రభుత్వ ఉద్యోగాల లక్ష్యాన్ని సాధించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శ్రీమతి పి. పద్మజ, గ్రేడ్-1 లైబ్రేరియన్ శ్రీ సిహెచ్. మాల్సూర్, గ్రేడ్-3 లైబ్రేరియన్లు శ్రీ బాబు, శ్రీ వెంకటేశ్వర్లు, సీనియర్ అసిస్టెంట్ శ్రీ పి. సంతోష్, కార్యాలయ సిబ్బంది మరియు సుమారు 400 మంది నిరుద్యోగ యువత పాల్గొన్నారు.




