Kothagudem: పునరుద్ధరించిన పోలీస్ భవనాలు ప్రారంభం: ఎస్పీ రోహిత్ రాజు

Kothagudem: హేమచంద్రపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్, ఓఎస్డీ కార్యాలయాల్లో పునరుద్ధరించిన డాగ్ కెన్నెల్, బ్యారక్స్, పార్కింగ్ షెడ్డును ఎస్పీ రోహిత్ రాజు ప్రారంభించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 2 Nov 2026 7:59 PM IST
Kothagudem
X

Kothagudem: పునరుద్ధరించిన పోలీస్ భవనాలు ప్రారంభం: ఎస్పీ రోహిత్ రాజు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హేమచంద్రపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్‌కు ముందుగా ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

తదనంతరం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో పునరుద్ధరించిన డాగ్ కెన్నెల్, బీడీ టీమ్ రూమ్, మెన్ బ్యారక్స్‌ను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. అదేవిధంగా మోటార్ వాహనాల పార్కింగ్ కోసం నూతనంగా నిర్మించిన షెడ్డు ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాగ్ స్క్వాడ్, బీడీ టీమ్ సిబ్బందితో మాట్లాడి వారి విధి నిర్వహణకు సంబంధించి ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. డాగ్‌ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వసతులు, బ్యారక్స్‌ను పరిశీలించి, నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసిన అధికారులను, సిబ్బందిని అభినందించారు.

అనంతరం ఓఎస్డీ కార్యాలయంలో పునరుద్ధరించిన ఆపరేషన్ ఆర్ఐ కార్యాలయ గది, మెన్ బ్యారక్స్‌ను ప్రారంభించారు. సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ ఇ. శ్రీనివాస్, ఆర్ఐలు సుధాకర్, రవి, నరసింహారావు, లాల్ బాబు, కృష్ణారావు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM