Kothagudem: సీతారామ జలాలను కొత్తగూడెం జిల్లాకే ఇవ్వాలి: గుమ్మడి నరసయ్య!

Kothagudem: సీతారామ ప్రాజెక్ట్ జలాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఇవ్వాలి: మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య డిమాండ్. వినోబానగర్ వద్ద కాల్వలను పరిశీలించిన సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ బృందం.

SK MAHABOOB JANI, JULURPADU
Published on: 22 Sept 2026 6:34 PM IST
Kothagudem
X

Kothagudem: సీతారామ జలాలను కొత్తగూడెం జిల్లాకే ఇవ్వాలి: గుమ్మడి నరసయ్య!

కొత్తగూడెం: ఇల్లందు మాజీ శాసనసభ్యులు, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు గుమ్మడి నరసయ్య, సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కెచ్చెల రంగారెడ్డి లు డిమాండ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సీతారామ ప్రాజెక్ట్ నీళ్లను కొత్తగూడెం జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు అందజేయాలని ఇల్లందు మాజీ శాసనసభ్యులు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు గుమ్మడి నరసయ్య, సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కెచ్చల రంగారెడ్డి లు డిమాండ్ చేశారు.

మంగళవారం జూలూరుపాడు మండల పరిధిలోని వినోబా నగర్ ప్రాంతంలోని సీతారామ ప్రాజెక్టును మాస్ లైన్ పార్టీ ప్రతినిధి బృందం పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో వేల ఎకరాలు భూములు కోల్పోయి ప్రాజెక్టు నిర్మాణం జరిగితే ఈ జిల్లాలోని రైతాంగానికి నీరు అందించకుండా ఇతర ప్రాంతాలకు జలాలను తరలిస్తూ ఉమ్మడి జిల్లాలోని మంత్రులు జలదోపిడి చేస్తున్నారని దుయ్యబట్టారు.

జిల్లా చివరి ప్రాంతమైన జూలూరుపాడు నుంచి ఖమ్మం జిల్లాకు నీరు తరలిస్తున్నారని, అదే సమయంలో ఇక్కడ రైతాంగానికి కూడా నీరు అందించేందుకు చర్యలు చేపట్టకపోవడం సరైన పద్ధతి కాదన్నారు. గతంలో డిజైన్ చేసిన విధంగా రోల్లపాడు చెరువు నింపడం ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తానికి పక్కనున్న మహబూబాబాద్ జిల్లాకు కూడా తక్కువ ఖర్చుతో నీరందించే అవకాశం ఉన్నప్పటికీ గతంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం రీ డిజైన్ చేసి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి చుక్క నీరును ఈ జిల్లా రైతాంగానికి అందించలేదని విమర్శించారు.

నేడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొదట నష్టపోతున్న ప్రాంతానికి నీరు అందించకుండా మంత్రులు అధికార బలంతో ఇతర ప్రాంతాలకు నీరు తరలించేందుకు యుద్ధ ప్రాతిపదికన నిధులు కేటాయించి కాలువలు నిర్మించారని, పంటలు పండే వారికే మరో పంట పండేందుకు నీరు అందించి మంత్రులు తమ కుటిల బుద్ధుని చాటుకున్నారని అన్నారు.

జిల్లాలోని ఏజెన్సీ గిరిజన ప్రాంతాలకు నీరు అందించేందుకు తక్షణమే సీతారామ ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. జూలూరుపాడు ప్రాంతంలో దండాల్ చెరువు చెనగచెరువు కప్పలకుంట చెరువులకు నీరు అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన పంట కాలువల తీయాలని వారు డిమాండ్ చేశారు. దీనిద్వారా సుజాత నగర్ ప్రాంతంలోని సింగభూపాలెం ప్రాజెక్టు కూడా నీరు చేరి పంటలు పండేందుకు అవకాశం ఉన్నదని వారన్నారు.

ఇప్పటికైనా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు జిల్లాలో నష్టపోయిన రైతాంగం కోసం, జిల్లాకు సీతారామ ప్రాజెక్టు నీళ్లు అందించేందుకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించి, ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేయించేందుకు కృషి చేయాలని కోరారు.

సీతారామ ప్రాజెక్ట్ కాల్వను పరిశీలించిన వారిలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి ముద్దా బిక్షం, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జాటోత్ కృష్ణ, అమర్లపూడి రాము, జిల్లా నాయకులు ఏదులాపురం గోపాలరావు,భానోత్ ధర్మ, ఎస్ కే యాకుషావలి, కల్లూరి కిషోర్ బుర్ర వెంకన్న మండల నాయకులు లింగాల వీరభద్రం తోటకూరి నరేష్ బైరు వెంకన్న రాయల సిద్దు తదితరులు పాల్గొన్నారు.

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU