Sathupally: సత్తుపల్లి మున్సిపాలిటీలో తీవ్ర పారిశుద్ధ్య సమస్యలు!
Sathupally: సత్తుపల్లి మున్సిపాలిటీ 1వ వార్డులో డ్రైనేజీ మురుగునీరు నిలిచి దోమల బెడద ఎక్కువైందని, పారిశుద్ధ్య సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
Sathupally: సత్తుపల్లి మున్సిపాలిటీలో తీవ్ర పారిశుద్ధ్య సమస్యలు!
సత్తుపల్లి: సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో పారిశుద్ధ్య సమస్యలు స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. డ్రైనేజీలో మురుగునీరు నిలిచిపోవడం, దుర్వాసన వెదజల్లడం, దోమలు పెరగడం వంటి సమస్యలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వార్డులోని పరిసర ప్రాంతాల్లో పిచ్చిమొక్కలు పెరగడం, చెత్తాచెదారం పేరుకుపోవడంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొందని వారు చెబుతున్నారు. ఈ పరిస్థితుల వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పన్నుల వసూళ్లపై ఉన్న శ్రద్ధ.. ప్రజా సమస్యల పరిష్కారంలోనూ చూపాలి!
మున్సిపాలిటీ అధికారులు పారిశుద్ధ్య సమస్యలపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం, నిల్వ ఉన్న మురుగునీటిని తొలగించడం, పిచ్చిమొక్కలను తొలగించి చెత్తాచెదారాన్ని పూర్తిగా శుభ్రం చేయడం వంటి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రజలకు కనీస పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించడం మున్సిపాలిటీ బాధ్యత అని, సమస్యలను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని కోరుతున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి 1వ వార్డులో పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించి, ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సమస్య పరిష్కారం కాకపోతే ప్రజల తరఫున సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పోరాటం కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు.




