Vemsur: మర్లపాడు రామాలయంలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్
Vemsur: వేంసూరు మండలం మర్లపాడు రామాలయంలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్, మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఆర్వీఎస్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Vemsur: మర్లపాడు రామాలయంలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్
వేంసూరు:సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడు గ్రామంలోని రామాలయంలో ఓబీసీ మోర్చా జిల్లా ప్రధానకార్యదర్శి పర్సా రాంబాబు, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దూపాటి లచ్చిరాజు ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఆర్.వి.ఎస్. యాదవ్, బీజేపీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ణి వీరంరాజు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు రామాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా జిల్లా ఉపాధ్యక్షులు పల్లపు వెంకన్న, జాలా అప్పారావు, చక్కిలాల మంగేశ్వరరావు, కంకోలం ఏడుకొండల రాజు, ఆదిరెడ్డి, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షులు మూడు సీతారాం తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సుపరిపాలనకు సంబంధించిన కార్యక్రమాల్లో భాగంగా జాతీయ, రాష్ట్ర, జిల్లా పార్టీ నాయకత్వం పిలుపు మేరకు సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్, మొక్కల నాటడం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టామని, ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై మరింత అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు.




