Sathupally: యాతాలకుంటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Sathupally: సత్తుపల్లి మండలం యాతాలకుంటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ. ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, ఎంపీ రఘురామ్ రెడ్డిల చేతుల మీదుగా కార్డుల అందజేత.
Sathupally: యాతాలకుంటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
సత్తుపల్లి: సత్తుపల్లి మండలం యాతాలకుంట గ్రామంలో శనివారం నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు, ఖమ్మం జిల్లా పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామ్ రెడ్డి గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిరెడ్డి సుబ్బారెడ్డి గారితో పాటు మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.




