Sathupally: బేతుపల్లి చెరువులో చిక్కుకున్న ఐదుగురిని కాపాడిన రెస్క్యూ టీం
Sathupally: సత్తుపల్లి బేతుపల్లి చెరువు వరదలో చిక్కుకున్న ఐదుగురు చేపల సొసైటీ సభ్యులను సురక్షితంగా కాపాడిన రెస్క్యూ బృందం, పోలీసులు. స్థానికుల అభినందనలు.
Sathupally: బేతుపల్లి చెరువులో చిక్కుకున్న ఐదుగురిని కాపాడిన రెస్క్యూ టీం
సత్తుపల్లి: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువుకు భారీగా వరద నీరు చేరింది. చెరువు అలుగు నుంచి చేపలు బయటకు కొట్టుకుపోకుండా అడ్డుకునేందుకు నైలాన్ వల ఏర్పాటు చేస్తున్న చేపల సొసైటీకి చెందిన ఐదుగురు సభ్యులు ఒక్కసారిగా పెరిగిన వరద ఉధృతికి చెరువులో చిక్కుకుపోయారు.
చెరువు అలుగు వద్ద నైలాన్ వల ఏర్పాటు చేసే పనిలో ఉండగా వరద ప్రవాహం అకస్మాత్తుగా పెరగడంతో వారు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.
తెప్పల సహాయంతో వరదలో చిక్కుకున్న ఐదుగురు సొసైటీ సభ్యులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో సీఐ శ్రీహరి ఆధ్వర్యంలోని పోలీసు బృందం సహకారం అందించింది. సకాలంలో స్పందించి ఐదుగురి ప్రాణాలను కాపాడిన రెస్క్యూ బృందం, పోలీసు సిబ్బందిని పలువురు అభినందించారు.




