Sathupally: సత్తుపల్లి ఫిజికల్ సైన్స్ ఫోరం అధ్యక్షులుగా ప్రసాద్!

Sathupally: సత్తుపల్లి ఫోరం ఫర్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా టీ. ప్రసాద్, జల్లిపల్లి మురళీమోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 29 Sept 2026 8:03 PM IST
Sathupally
X

Sathupally: సత్తుపల్లి ఫిజికల్ సైన్స్ ఫోరం అధ్యక్షులుగా ప్రసాద్!

Sathupally: ఫోరం ఫర్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా టీ ప్రసాదు జల్లిపల్లి మురళీమోహన్ లను మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సత్తుపల్లి డివిజన్ ఫిజికల్ టీచర్స్ ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని వేంసూరు మండలం అడసర్లపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించి ఫిజికల్ సైన్స్ బలోపేతానికి ఈ కొత్త కమిటీ మార్గదర్శకంగా నిలవాలని కాంప్లెక్స్ హెడ్మాస్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సత్తుపల్లి వేంసూరు మండలాల ఫిజికల్ సైన్స్ ఫోరం కమిటీలను ప్రకటించారు. కొత్తగా ఎన్నికైన బాధ్యులు మాట్లాడుతూ ఫిజికల్ సైన్స్ పాఠ్యాంశాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి మార్పులు చేర్పులతో పాటు, ప్రశ్నాపత్రం, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు అధికారులకు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో సత్తుపల్లి భాద్యులు సుదర్శన్, తెరెస్సా తదితరులు పాల్గొన్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI