Sathupally: సత్తుపల్లిలో వరద బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం!

Sathupally: సత్తుపల్లి కేసీఆర్ కాలనీ వరద బాధితులకు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నిత్యావసరాలు, రూ.5 వేల సాయం అందజేశారు. ప్రభుత్వం రూ.50 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 6 Nov 2026 7:55 PM IST
Sathupally
X

Sathupally: సత్తుపల్లిలో వరద బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం!

సత్తుపల్లి: సత్తుపల్లి పట్టణ శివారులోని కేసీఆర్ కాలనీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో ఆకస్మిక వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన పలు కుటుంబాలకు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అండగా నిలిచారు. వరద బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి 10 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులతో పాటు దిండు దుప్పట్లు, పరుపులు అందజేశారు. అంతేకాకుండా ప్రతి కుటుంబానికి రూ.5 వేల చొప్పున తక్షణ ఆర్థిక సహాయం అందించి బాధితులకు భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ.. ఆకస్మిక వరదలతో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు. ప్రతి బాధిత కుటుంబానికి రూ.50 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కేసీఆర్ కాలనీ పక్కనే ఉన్న లారీ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో వరదల కారణంగా సుమారు 70కి పైగా లారీల ఇంజిన్లు దెబ్బతిని తీవ్ర ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. లారీ యజమానులు కూడా భారీగా నష్టపోయారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. లారీ యజమానులకు కూడా తగిన పరిహారం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

వరదలతో నష్టపోయిన పేద కుటుంబాలు, లారీ యజమానులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించి న్యాయం చేయాలని సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కూసంపూడి మహేష్, కొత్తూరు ఉమామహేశ్వరరావు, షేక్ రఫీ వీరపనేని బాబి రాధిక, బెల్లంకొండ రాము, భాష, నరుకుల శ్రీను, అమరవారపు కృష్ణారావు, చాంద్ పాషా, అద్దంకి అనిల్, పర్వతనేని వేణు, వల్లభనేని పవన్, గుండ్ర రఘు, గాదె సురేష్, మేకల నరసింహారావు, నడ్డి ఆనందరావు, జొన్నలగడ్డ విజయ్, గంజి వెంకటేశ్వరరావు, అక్షింతలు చంటి, మరికంటి శీను, తడికిమల్లా ప్రకాష్ రావు, రామిశెట్టి కృష్ణ, క్లబ్ వెంకటేశ్వరరావు, మిద్దె శ్రీను, షేక్ బాబు, తదితరులు ఉన్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI