Sathupally: సత్తుపల్లి నుంచి అన్నవరం, పంచారామాలకు స్పెషల్ బస్సులు
Sathupally: కార్తీక మాసం వేళ సత్తుపల్లి డిపో నుంచి అన్నవరం, పంచారామాలకు ప్రత్యేక డీలక్స్ బస్సులు. వివరాలు వెల్లడించిన డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ.
Sathupally: సత్తుపల్లి నుంచి అన్నవరం, పంచారామాలకు స్పెషల్ బస్సులు
సత్తుపల్లి: కార్తీక మాసం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం సత్తుపల్లి డిపో నుండి అన్నవరం, పంచారామాలకు ప్రత్యేక డీలక్స్ బస్సులు ఏర్పాటు చేసినట్లు సత్తుపల్లి డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్తీక మాసంలో ఏర్పాటు చేసిన స్పెషల్ బస్సులకు సంబంధించి కరపత్రాలను ఆయన విడుదల చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సత్తుపల్లి డిపో నుండి ఈనెల 15, 22, 29 తేదీలు మరియు డిసెంబర్ 6 తేదీలలో పంచారామాలకు, అన్నవరం కు ప్రతి ఆదివారం రాత్రి 10 గంటలకు బస్సులు బయలుదేరుతాయి అని అన్నారు. పంచారామాలకు పెద్దలకు చార్జీ 1480 రూపాయలు పిల్లలకు చార్జీ 780 రూపాయలు గా నిర్ణయించినట్లు ఆయన వివరించారు.
అన్నవరం కు చార్జి పెద్దలకు 610 పిల్లలకు 350 రూపాయల గా నిర్ణయించినట్లు డిపో మేనేజర్ తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం పంచారామాలకు 95820 సర్వీస్ నెంబర్ తో మరియు అన్నవరంకు 98000 సర్వీస్ నెంబర్ తో ఆన్లైన్ సౌకర్యం కల్పించినట్లు ఆయన తెలిపారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 23వ తేదీ సోమవారం రాత్రి ప్రత్యేక డీలక్స్ బస్స అన్నవరం, పంచారామాలకు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు 9866619189,7032182456,9959225962,9959225990 సంప్రదించవచ్చును అని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ ఎస్ సాహితి, స్టేషన్ మేనేజర్ జాలాది.ఆనందం, TI 3 జాకబ్, మస్తాన్ బి, హుస్సేన్ , శివకోటి తదితరులు పాల్గొన్నారు.




