Sathupalli: సత్తుపల్లి - ఖమ్మం రూట్‌లో ఎక్స్‌ప్రెస్ ఛార్జీలతోనే డీలక్స్ బస్సు ప్రయాణం!

Sathupalli: సత్తుపల్లి-ఖమ్మం మార్గంలో ఎక్స్‌ప్రెస్ ఛార్జీతోనే డీలక్స్ బస్సు ప్రయాణ సౌకర్యం. ప్రతి 8 నిమిషాలకు ఒక బస్సు నడుపుతున్నట్లు సత్తుపల్లి డిపో మేనేజర్ వెల్లడి.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 30 Sept 2026 3:36 PM IST
Sathupalli
X

Sathupalli: సత్తుపల్లి - ఖమ్మం రూట్‌లో ఎక్స్‌ప్రెస్ ఛార్జీలతోనే డీలక్స్ బస్సు ప్రయాణం!

Sathupalli: సత్తుపల్లి నుండి ఖమ్మం ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం ఎక్స్ప్రెస్ చార్జీతో డీలక్స్ బస్సులలో ప్రయాణించవచ్చునని సత్తుపల్లి డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం నుండి సత్తుపల్లి- ఖమ్మం రూట్ లో తిరిగే డీలక్స్ బస్సులలో ఎక్స్ప్రెస్ చార్జి చెల్లించి ప్రయాణికులు ప్రయాణించవచ్చని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అదేవిధంగా సత్తుపల్లి నుండి ఖమ్మం ప్రతి ఎనిమిది నిమిషములకు ఒక బస్సు తిరిగే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు.

సత్తుపల్లి ఖమ్మం మొత్తం 99 ట్రిప్పులు బస్సులు తిరుగుతున్నాయని ప్రయాణికులు సదవకాశాన్ని సద్వినిగం చేసుకోవాలి అన్నారు. ఇప్పటివరకు డీలక్స్ బస్సులకు సత్తుపల్లి -ఖమ్మం చార్జి 130 రూపాయలు ఉండగా బుధవారం నుండి డీలక్స్ బస్సులలో 120 రూపాయలు చార్జీ నిర్ణయించినట్లు ఆయన వివరించారు. సత్తుపల్లి- ఖమ్మం రూట్ లో మొత్తం పది డీలక్స్ లు నడుపుతున్నట్లు ఆయన తెలిపారు.సత్తుపల్లి -విజయవాడ ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సత్తుపల్లి- అశ్వరావుపేట కు ఇప్పటివరకు తిరుగుతున్న సర్వీసులతోపాటు అదనంగా ఆరు ట్రిప్పులు ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. సత్తుపల్లి అంకంపాలెం సాయంత్రం 6 గంటలకు విద్యార్థులు, ప్రయాణికుల సౌకర్యార్థం ఒక ట్రిప్పు అదనంగా నడుపుతున్నట్లు డిపో మేనేజర్ వివరించారు. సత్తుపల్లి నుండి ఏలూరు రెండు సర్వీసులు అదనంగా నడుపుకున్నట్లు డిపో మేనేజర్ తెలిపారు.

సత్తుపల్లి, అంకంపాలెం ములకలపల్లి, పొగళ్లపల్లి ,బూర్గంపాడు మీదుగా భద్రాచలానికి నూతనంగా ఒక పల్లె వెలుగు బస్సు నడుపుతున్నామని అన్నారు. సత్తుపల్లి నుండి లంకపల్లి, నీలాద్రి మీదుగా కొత్తగూడెం కు నూతన సర్వీస్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు .ప్రయాణికులు ఈ సదా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని ఈ సందర్భంగా డిపో మేనేజర్ కోరారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ తోపాటు అసిస్టెంట్ మేనేజర్ జి రజిత పాల్గొన్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI