Sathupalli: లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం తోట లహరి ప్రియకు రూ.25 వేల ఆర్థిక సాయం!
Sathupalli: లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్స కోసం అనారోగ్యంతో బాధపడుతున్న తోట లహరి ప్రియకు సత్తుపల్లి టాలెంట్ స్కూల్ తరఫున రూ.25 వేల ఆర్థిక సాయం అందించారు.
Sathupalli: లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం తోట లహరి ప్రియకు రూ.25 వేల ఆర్థిక సాయం!
సత్తుపల్లి: అనారోగ్యంతో బాధపడుతున్న తోట లహరి ప్రియ అనే పాపకు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నిమిత్తం స్థానిక టాలెంట్ స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కలిసి రూ.25,000 ఆర్థిక సహాయం అందించి తమ మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పులి శ్రీనివాసరావు మాట్లాడుతూ, తోట లహరి ప్రియ త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ఇంటికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆపదలో ఉన్న వారికి సహాయం అందించడం మానవత్వానికి నిదర్శనమని, విద్యార్థుల్లో సేవాభావం, సానుభూతి, సామాజిక బాధ్యతలను పెంపొందించే ఉద్దేశంతో పాఠశాల తరఫున ఈ సహాయాన్ని అందించినట్లు పేర్కొన్నారు.
పాప త్వరగా కోలుకొని మళ్లీ ఆనందంగా తన జీవితాన్ని కొనసాగించాలని టాలెంట్ స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆకాంక్షించారు.




