Vemsur: పిడుగుపాటు బాధితులకు సండ్ర భరోసా: తక్షణ సాయం డిమాండ్
Vemsur: వేంసూరు మండలంలో పిడుగుపాటుతో మృతిచెందిన పర్సా ఆనందరావు కుటుంబాన్ని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పరామర్శించి పరిహారం డిమాండ్ చేశారు.
Vemsur: పిడుగుపాటు బాధితులకు సండ్ర భరోసా: తక్షణ సాయం డిమాండ్
వేంసూరు: పిడుగుపాటుకు గురై కుటుంబ పెద్ద పర్సా ఆనందరావు అకాల మరణం చెందడంతో శోకసంద్రంలో మునిగిన కుటుంబాన్ని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు సండ్ర వెంకటవీరయ్య సోమవారం పరామర్శించారు. కుటుంబ పెద్దను కోల్పోయిన బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ.. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న ఆనందరావు పిడుగుపాటుతో మృతిచెందడం అత్యంత బాధాకరమన్నారు. ముగ్గురు ఆడబిడ్డల భవిష్యత్తుకు అండగా నిలవాల్సిన సమయంలో కుటుంబ పెద్దను కోల్పోవడం కలచివేసిందన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ కుటుంబానికి అండగా ఉంటుందని, అన్ని విధాలా ఆదుకునేందుకు కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు.
ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి
పిడుగుపాటుతో మృతిచెందిన ఆనందరావు కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సండ్ర వెంకటవీరయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బాధిత కుటుంబానికి అందాల్సిన నష్టపరిహారాన్ని త్వరగా విడుదల చేసి బాసటగా నిలవాలని కోరారు.
పలువురు కుటుంబాలకు పరామర్శ
అనంతరం గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన పర్సా కృష్ణ, ఈడా. వెంకటేశం కుటుంబ సభ్యులను పరామర్శించి వారి చిత్రపటాలు పూలమాలు వేసి నివాళులర్పించి తన ప్రగాఢ సానుభూతిని సండ్ర వెంకటవీరయ్య వ్యక్తం చేశారు.. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోతురాజు చక్రధరావు, మాజీ ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, దొడ్డ వెంకట కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ పోతురాజు పావల్ రాజ్, నాయకులు గొర్ల రాంమోహన్ రెడ్డి, గండ్ర సోమిరెడ్డి, ఆర్చేపల్లి కరుణప్రసాద్, గుత్తా శ్రీనివాసరావు, పగుట్ల నరసింహారావు, వీరబాబు, మేడా విజయబాబు, పగుట్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.




