Sathupalli: యాతాలకుంటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఎంపీ రఘురామారెడ్డి
Sathupalli: సత్తుపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొన్న ఎంపీ రఘురామారెడ్డి, ఎమ్మెల్యే రాగమయి. బీఆర్ఎస్ పాలనపై విమర్శలు, సీతారామ టన్నెల్ పనుల పరిశీలన.
Sathupalli: యాతాలకుంటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఎంపీ రఘురామారెడ్డి
సత్తుపల్లి: మండలం పరిధిలోని యాతాలకుంట గ్రామంలో శనివారం లబ్ధిదారులకు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయితో కలిసి ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామ రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం పై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను గుర్తు చేశారు.
ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామారెడ్డి మాట్లాడుతూ.గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అప్పుల పాలు చేసిందని. కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్లు లూటీ చేశారని ఆరోపించారు. అప్పుల ఊబిలో కూరుకుపోయినప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, మహిళలకు ఉచిత ప్రయాణం సన్న బియ్యం వంటి సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని ఎమ్మెల్యే వట్టా రాగమయి తెలిపారు. రాష్ట్రం ఎంత ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ, ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నామని స్పష్టం చేశారు. గత పదేళ్లలో కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వని బీఆర్ఎస్ ప్రభుత్వం, నేడు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతుంటే విమర్శలు చేయడం సరికాదన్నారు. సన్నబియ్యం, ఫ్రీ కరెంట్, ఫ్రీ బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు వంటి పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అనంతరం సీతారామ ప్రాజెక్ట్ యాతాలకుంట టన్నెల్ పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించి పనుల పురోగతి పై ఆరా తీశారు 1800 మీటర్ల టన్నెల్ పనులలో పూర్తి కావాల్సిన 600 మీటర్ల లైనింగ్ పనులు 35 రోజుల్లో పూర్తవుతాయని అధికారులు తెలిపారని గోదావరి జలాలను జిల్లా రైతులకు అందించాలనే ప్రభుత్వ లక్ష్యం త్వరలోనే నెరవేరబోతుందన్నారు.




