Sathupalli: వరద బాధితులకు సింధు హాస్పిటల్స్ ఆర్థిక సాయం

Sathupalli: సండ్ర వెంకట వీరయ్య విజ్ఞప్తికి స్పందించిన ఎంపీ బండి పార్థసారథి రెడ్డి సింధు హాస్పిటల్స్ తరఫున సత్తుపల్లి వరద బాధితులకు రూ.6.40 లక్షల చెక్కులు అందించారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 19 Nov 2026 7:06 PM IST
Sathupalli
X

Sathupalli: వరద బాధితులకు సింధు హాస్పిటల్స్ ఆర్థిక సాయం

సత్తుపల్లి: సత్తుపల్లి పట్టణంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా కేసీఆర్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలోకి వరద నీరు చేరి తీవ్రంగా నష్టపోయిన బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు చేసిన కృషి ఫలించింది.

వరదల కారణంగా ఇళ్లలోకి నీరు చేరి నిత్యావసర వస్తువులు, ఇంటి సామగ్రి దెబ్బతిని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు స్వయంగా పరామర్శించి, వారి దయనీయ పరిస్థితులను పరిశీలించి నిత్యవసర సరుకులు, 10 కిలోల బియ్యం, 5000 రూపాయలు అందించారు.

ఈ సందర్భంగా బాధితులు పలు అంశాలను సండ్ర వెంకట వీరయ్య గారికి తెలియజేయడంతో బాధితులకు ఆర్థికంగా అండగా నిలవాలనే ఉద్దేశంతో రాజ్యసభ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, హెటెరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్, సింధు హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి గారిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.

సండ్ర వెంకట వీరయ్య గారి విజ్ఞప్తికి మానవతా దృక్పథంతో స్పందించిన డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి గారు సింధు హాస్పిటల్స్ తరఫున వరద బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా ఈరోజు వరదల కారణంగా ఇళ్లు నీటమునిగి నష్టపోయిన 96 బాధిత కుటుంబాలకు రూ:640000 ల ఆర్థిక సహాయ చెక్కులను పంపిణీ చేశారు.

ఆపద సమయంలో తమ కష్టాలను గుర్తించి, బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి గారికి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజాప్రతినిధిగా బాధితుల సమస్యలను గుర్తించి సహాయం కోసం కృషి చేసిన సండ్ర వెంకట వీరయ్య గారికి, ఆయన విజ్ఞప్తికి స్పందించి సింధు హాస్పిటల్స్ ద్వారా ఆర్థిక సహాయం అందించిన డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి గారి మానవతా దృక్పథం అభినందనీయమని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI