Sathupalli: వర్షాన్ని లెక్కచేయకుండా గణేష్ నిమజ్జనంలో పాల్గొన్న ఎమ్మెల్యే
Sathupalli: సత్తుపల్లిలో భారీ వర్షంలోనూ గణేష్ నిమజ్జన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్. ప్రత్యేక పూజలు నిర్వహించిన నాయకులు.
Sathupalli: వర్షాన్ని లెక్కచేయకుండా గణేష్ నిమజ్జనంలో పాల్గొన్న ఎమ్మెల్యే
సత్తుపల్లి: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గణేష్ నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు. సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొని, భక్తులతో కలిసి గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు.
సత్తుపల్లి పట్టణంలోని JVR పార్క్, హనుమాన్ నగర్, ఎన్టీఆర్ కాలనీ, బైపాస్ రోడ్, వేంసూరు రోడ్‌లోని షాదీఖానా సమీపం, నేతాజీ రోడ్ తదితర ప్రాంతాల్లోని గణేష్ మండపాలను ఎమ్మెల్యే సందర్శించారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ, గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించిన భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని గణనాథుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రోహనా బేగం కమల్ పాషా, సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్, సీనియర్ నాయకులు బొంతు వేణు సుమలత, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె చెన్నారావు, భక్తుల భరత్ మల్లూరి దిలీప్ కౌన్సిలర్లు దేవి శ్రీను నాగభూషణం మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, భక్తులు, మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




