Sathupalli: మంత్రి పొంగులేటి జన్మదినం సందర్భంగా సత్తుపల్లిలో అయ్యప్ప భిక్ష!

Sathupalli: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదినం సందర్భంగా సత్తుపల్లి అయ్యప్ప ఆలయంలో భిక్ష కార్యక్రమం. పాల్గొన్న ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 28 Oct 2026 7:43 PM IST
Sathupalli
X

Sathupalli: మంత్రి పొంగులేటి జన్మదినం సందర్భంగా సత్తుపల్లిలో అయ్యప్ప భిక్ష!

Sathupalli: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని సత్తుపల్లి పట్టణంలోని హరిహరాత్మజ అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ శ్రీమతి రెహనా కమల్ పాషా గారి ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ గారు పాల్గొని అయ్యప్ప స్వాములకు స్వయంగా భిక్షను అందజేశారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆయురారోగ్యాలతో, మరిన్ని ఉన్నత పదవులు అధిరోహిస్తూ ప్రజలకు నిరంతరం సేవలందించాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, పట్టణ మరియు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.