Sathupalli: మహిళా ఎమ్మెల్యేపై వ్యక్తిగత దూషణలు చేస్తే ఊరుకోం: రాగమయి!

Sathupalli: మహిళా ప్రజాప్రతినిధిపై అనుచిత వ్యాఖ్యలు, విద్వేష వాట్సాప్ సందేశాలు పంపితే చట్టపరమైన చర్యలు తప్పవని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి హెచ్చరించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 9 Nov 2026 6:59 PM IST
Sathupalli
X

Sathupalli: మహిళా ఎమ్మెల్యేపై వ్యక్తిగత దూషణలు చేస్తే ఊరుకోం: రాగమయి!

సత్తుపల్లి నవంబర్ 9: మహిళా ప్రజాప్రతినిధులను ఉద్దేశించి కొందరు వ్యక్తులు చేస్తున్న అనుచిత, అవమానకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ స్పష్టం చేశారు. మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం, అసభ్యకర వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని ఆమె మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, అయితే ఆ విమర్శలు హుందాగా, నిర్మాణాత్మకంగా ఉండాలని హితవు పలికారు. వ్యక్తిగత దూషణలకు, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

గత 30 సంవత్సరాలుగా ప్రజాసేవలో కొనసాగుతున్నామని, ఎన్నో ఏళ్లుగా ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇన్నేళ్లుగా తాము ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు మాట్లాడని కొందరి నోళ్లు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయని ప్రశ్నించారు. పదవులు ఉన్నప్పుడు మాత్రమే ప్రజల్లో ఉండేవాళ్లం కాదని, పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యే ఉంటూ ప్రజా సమస్యల కోసం పనిచేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

రాజకీయాల్లో విమర్శలు సహజమని, వాటిని స్వాగతిస్తామని, కానీ మహిళా ప్రజాప్రతినిధుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడటం, అసత్య ఆరోపణలు చేయడం సహించబోమని రాగమయి దయానంద్ తేల్చిచెప్పారు. ప్రజలకు సేవ చేయడమే తమకు తెలిసిన రాజకీయమని, వ్యక్తిగత విమర్శలకు భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆశీర్వాదం, నమ్మకమే తమ బలమని.. ఎన్ని విమర్శలు ఎదురైనా ప్రజాసేవలో ముందుకు సాగుతామని ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.