Sathupalli: సత్తుపల్లి జేవీఆర్ కళాశాల పూర్వ విద్యార్థుల సన్నాహక సమావేశం!

Sathupalli: సత్తుపల్లి జేవియర్ (జేవీఆర్) ప్రభుత్వ డిగ్రీ కళాశాల 50 వసంతాల స్వర్ణోత్సవాల నిర్వహణపై పూర్వ విద్యార్థుల సన్నాహక సమావేశం జరిగింది.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 4 Oct 2026 9:30 PM IST
Sathupalli
X

Sathupalli: సత్తుపల్లి జేవీఆర్ కళాశాల పూర్వ విద్యార్థుల సన్నాహక సమావేశం!

సత్తుపల్లి: సత్తుపల్లి జేవియర్ డిగ్రీ కళాశాలలో ఆదివారం ఓల్డ్ స్టూడెంట్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డాక్టర్ దయానంద్ ముఖ్య అతిథిగా హాజరై, రాబోయే రోజుల్లో నిర్వహించనున్న జేవీఆర్ కళాశాల స్వర్ణోత్సవాల ఏర్పాట్లపై పూర్వ విద్యార్థులతో చర్చించారు.

ఈ సందర్భంగా డాక్టర్ దయానంద్ మాట్లాడుతూ స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు పూర్వ విద్యార్థులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కమిటీ సభ్యులకు పలు విలువైన సూచనలు, సలహాలు అందించారు. ఆయన మాటలు, సూచనలు సమావేశానికి హాజరైన వారిలో నూతన ఉత్సాహాన్ని నింపాయి.

ఈ నెల 18వ తేదీ ఆదివారం జేవియర్ డిగ్రీ కళాశాలలో పూర్వ విద్యార్థులందరితో భారీ స్థాయిలో సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. స్వర్ణోత్సవాల నిర్వహణకు తన అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని భరోసా ఇచ్చారు.

“అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ అందరికీ సేవ చేయడమే నా ధ్యేయం. నిత్యం ప్రజల్లోనే, ప్రజల మధ్యనే ఉంటాను” అని డాక్టర్ దయానంద్ పేర్కొన్నారు. అనంతరం సమావేశానికి హాజరైన పూర్వ విద్యార్థులు, సభ్యులు చప్పట్లతో డాక్టర్ దయానంద్‌ను అభినందించారు. స్వర్ణోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అందరూ కలిసి పనిచేయాలని నిర్ణయించారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI