Sathupalli: తండ్రి జ్ఞాపకార్థం రూ.1.5 లక్షల 700 మొక్కల పంపిణీ
Sathupalli: సత్తుపల్లిలో ఇమ్మడి రంగారావు దశదిన కర్మ సందర్భంగా రూ.1.50 లక్షల విలువైన 700 పండ్ల, హైబ్రిడ్ మొక్కలను కుటుంబ సభ్యులు ఉచితంగా పంపిణీ చేశారు.
Sathupalli: తండ్రి జ్ఞాపకార్థం రూ.1.5 లక్షల 700 మొక్కల పంపిణీ
సత్తుపల్లి: తండ్రి జ్ఞాపకాలను పదిలం చేసుకుంటూ పర్యావరణ పరిరక్షణకు తమవంతు కృషి చేయాలనే సంకల్పంతో ఇమ్మడి కుటుంబ సభ్యులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సత్తుపల్లికి చెందిన ఇమ్మడి రంగారావు (90) ఇటీవల మృతి చెందారు. బుధవారం ఆయన దశదిన కర్మ సందర్భంగా ఆయన కుమారుడు డాక్టర్ ఐమ్మడి ప్రసాద్ సుమారు రూ.1.50 లక్షల విలువైన 700 మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు.
మామిడి, సపోటా, పనసతో హైబ్రిడ్ మొక్కలను పంపిణీ చేసి తండ్రిపై తమకున్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు. తండ్రి జ్ఞాపకార్థం నాటిన ప్రతి మొక్క భవిష్యత్తులో పచ్చదనానికి, పర్యావరణ పరిరక్షణకు దోహదపడా లని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మడి రంగారావు కుటుంబ సభ్యులు డాక్టర్ ప్రసాద్, డాక్టర్ నిఖిల్, డాక్టర్ కార్తిక్, పట్టణ ప్రముఖులు కొత్తూరు ప్రభాకర్‌రావు, చలుగుళ్ళ నర్సింహారావుతో పాటు పట్టణంలోని వివిధ ఆసుపత్రులకు చెందిన వైద్యులు, పట్టణ ప్రముఖులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.
విశ్వశాంతిలో.... ఇమ్మడి రంగారావు స్మృతికి నివాళిగా విశ్వశాంతి విద్యాలయంలో విద్యార్థులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ పట్ల తమ బాధ్యతను, ప్రకృతి పట్ల ప్రేమను చాటుకున్నారు. ఈ సందర్భంగా మొక్కల ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు.




