Sathupalli: సత్తుపల్లి ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల వద్ద పారిశుద్ధ్య సమస్యలు

Sathupalli: సత్తుపల్లి పట్టణంలోని ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల పరిసరాల్లో అపరిశుభ్రత, వీధి దీపాల కొరతపై బీజేపీ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 21 Sept 2026 8:56 PM IST
Sathupalli
X

Sathupalli: సత్తుపల్లి ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల వద్ద పారిశుద్ధ్య సమస్యలు

సత్తుపల్లి: సత్తుపల్లి పట్టణంలోని ఎస్సీ, ఎస్టీ బాలబాలికల హాస్టల్ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, పెరిగిపోయిన పిచ్చి మొక్కలు, వీధి దీపాల కొరతపై భారతీయ జనతా పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.

మున్సిపాలిటీకి సమీపంలోనే ఉన్న ఈ హాస్టల్‌లో అనేకమంది విద్యార్థులు నివసిస్తూ ప్రతిరోజూ పాఠశాలలకు వెళ్లి తిరిగి వస్తుంటారు. అయితే హాస్టల్ నుంచి వెళ్లే దారిలో విద్యుత్ స్తంభాలకు సరైన వీధి దీపాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ నాయకులు పేర్కొన్నారు.

అదేవిధంగా హాస్టల్‌కు సమీపంలోని ఖాళీ ప్రదేశాల్లో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగి అడవిని తలపించే పరిస్థితి నెలకొంది. ఈ ప్రాంతాలు దోమలు, పాములు, తేళ్లకు ఆవాసాలుగా మారే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టల్‌కు పక్కనే చెత్త పేరుకుపోవడం వల్ల పారిశుద్ధ్య సమస్య మరింత తీవ్రమవుతోందని తెలిపారు.

సత్తుపల్లి పట్టణం అభివృద్ధి చెందుతోందని ప్రచారం చేస్తున్న రాజకీయ నాయకులు, అధికార పార్టీ నాయకులు ఇలాంటి మౌలిక సమస్యలపై కూడా దృష్టి సారించాలని బీజేపీ నాయకులు కోరారు. పట్టణంలోని ఖాళీ స్థలాల్లో పెరిగిపోయిన పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు.

విద్యార్థుల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని హాస్టల్ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని, పిచ్చి మొక్కలను పూర్తిగా శుభ్రం చేయాలని, విద్యార్థులు రాకపోకలు సాగించే మార్గాల్లో వీధి దీపాలను ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.

భారతీయ జనతా పార్టీ సత్తుపల్లి పట్టణ అధ్యక్షులు బానోతు విజయ ఆధ్వర్యంలో సత్తుపల్లి బీజేపీ పట్టణ నాయకులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జొన్నలగడ్డ నరేష్ పట్టణ ప్రధాన కార్యదర్శి మంద శివ,మాజీ మండల అధ్యక్షులు పాలకొల్లు శ్రీనివాస్,టౌన్ కార్యదర్శి సాయి వర్ధన్, obc మోర్చా పట్టణ అధ్యక్షులు వెదుళ్ల వీరబాబు, బండి ఆంజనేయులు,బట్టి శివ సాయి,ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, తక్షణమే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI