Sathupalli: ఘనంగా షాహిద్ భగత్ సింగ్ 119వ జయంతి సభ

Sathupalli: సత్తుపల్లిలో ఘనంగా భగత్ సింగ్ 119వ జయంతి. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని ప్రజా సంఘాల నాయకుల పిలుపు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 22 Sept 2026 8:07 PM IST
Sathupalli
X

Sathupalli: ఘనంగా షాహిద్ భగత్ సింగ్ 119వ జయంతి సభ

సత్తుపల్లి: అమెరికా ఆధిపత్య ధోరణులు, సామ్రాజ్యవాద యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా దేశంలోని ప్రజాస్వామ్య, ప్రగతిశీల శక్తులు ఐక్యంగా పోరాడాలని PDSU, PYL, POW ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో PDSU (ప్రగతిశీల ప్రజాతంత్ర విద్యార్థి సంఘం), PYL (ప్రగతిశీల యువజన సంఘం), POW (ప్రగతిశీల మహిళా సంఘం) జిల్లా కమిటీల ఆధ్వర్యంలో అమరవీరుడు, విప్లవ వీరుడు షాహిద్ భగత్ సింగ్ 119వ జయంతి సభ ఘనంగా సత్తుపల్లి నీలం రామచంద్రయ్య భవనంలో సదస్సు నిర్వహించటం జరిగింది .

ఈ సందర్బంగా POW రాష్ట్ర కోశాధికారి ఝాన్సీ పి వై జిల్లా సహాయ కార్యదర్శి సంఘం అరుణ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తూ, ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న అమెరికా యుద్ధోన్మాద విధానాలను తీవ్రంగా నిరసించారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కాపాడబడాలంటే ప్రజల ఐక్య పోరాటాలను బలోపేతం చేయాలని స్పష్టం చేశారు. భగత్ సింగ్ కేవలం బ్రిటిష్ పాలనపైనే కాకుండా దోపిడీ లేని సమాజం కోసం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడారని గుర్తుచేశారు. ఆయన చూపిన ధైర్యం, త్యాగం, సామాజిక మార్పు స్ఫూర్తితో నేటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

అలాగే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ, ఫాసిస్ట్ వైఖరికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య శక్తులు ఏకమై ఫాసిజాన్ని తరిమికొట్టాలని కోరారు. రోజురోజుకూ పెరుగుతున్న మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలకు వ్యతిరేకంగా మహిళా లోకం చైతన్యవంతమై పోరాడాలని ఉద్ఘాటించారు. యువత జీవితాలను, భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల సంస్కృతికి వ్యతిరేకంగా విద్యార్థి, యువజన లోకం సమరశీల పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో pow మండల కార్యదర్శి వేంకట నరసమ్మ, అలివేలు, సుకన్య, pyl నాయకులు నాగరాజు, రమేష్, నగేష్,పాల్గొన్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI