Sathupalli: అయ్యగారిపేట జడ్పీహెచ్ఎస్‌లో ఘనంగా ‘ఏక్ పేడ్ మా కే నామ్’!

Sathupalli: సత్తుపల్లి అయ్యగారిపేట జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమం. మొక్కలు నాటిన మున్సిపల్ చైర్‌పర్సన్ రేహానా బేగం, కమిషనర్ నరసింహ, ఎంఈఓ.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 19 Sept 2026 11:19 PM IST
Sathupalli
X

Sathupalli: అయ్యగారిపేట జడ్పీహెచ్ఎస్‌లో ఘనంగా ‘ఏక్ పేడ్ మా కే నామ్’!

సత్తుపల్లి: సత్తుపల్లి పట్టణంలోని ZPHS బాలికల పాఠశాల, అయ్యగారిపేటలో పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రేహానా బేగం, మున్సిపల్ కమిషనర్ శ్రీ నరసింహ, MEO శ్రీ ఎన్. రాజేశ్వర్ రావు హాజరయ్యారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎన్. నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ సందర్భంగా ముఖ్య అతిథులు పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి, వాటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని విద్యార్థులకు తెలియజేశారు. చెట్లు పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తాయని వారు పేర్కొన్నారు.

విద్యార్థులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొని మొక్కలను నాటారు. మొక్కలను సంరక్షిస్తూ పాఠశాల పరిసరాలను పచ్చదనంతో నింపాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI