Sathupalli: ఘనంగా 11వ అంతర్జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

Sathupalli: సత్తుపల్లిలో 11వ అంతర్జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు. మొక్కలు నాటడం, యోగా వాక్ నిర్వహించి ఆరోగ్యంపై అవగాహన కల్పించిన వైద్యులు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 22 Sept 2026 7:53 PM IST
Sathupalli
X

Sathupalli: ఘనంగా 11వ అంతర్జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

సత్తుపల్లి: 11వ అంతర్జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆయుష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ యునాని వైద్యశాల, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల సంయుక్తంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

సెప్టెంబర్ 21న మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడంతో పాటు, అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యకరమైన ఆహారం, సమతుల్య ఆహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. సెప్టెంబర్ 22న ఆరోగ్య పరిరక్షణలో యోగా ప్రాధాన్యతను తెలియజేస్తూ యోగ వాక్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో యునాని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజేందర్, ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షీలా స్రవంతి, ఫార్మసిస్టులు సంతోష్ కుమార్, కె. శ్రీనివాసరావు, యోగా ఇన్‌స్ట్రక్టర్ శాంతి, ఎస్‌ఎన్‌ఓ ప్రవీణ్ కుమార్, వంశీ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు సంప్రదాయ వైద్య విధానాలతో పాటు యోగా, ఆరోగ్యకరమైన ఆహారం, పరిశుభ్రతను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని వారు సూచించారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI